Abn logo
Sep 28 2021 @ 00:44AM

కదం తొక్కిన కామ్రేడ్లు... తెలుగు తమ్ముళ్లు

పెనుకొండలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు

బంద్‌ ప్రశాంతం

 కదం తొక్కిన కామ్రేడ్లు... తెలుగు తమ్ముళ్లు

మేము సైతమంటూ కాంగ్రెస్‌, కార్మిక, కర్షక, ప్రజాసంఘాలు

రాస్తారోకోలు... భారీ ర్యాలీలతో హోరెత్తిన నిరసనలు

వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు స్వచ్ఛందంగా మూసివేత 

ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం

నిర్మానుష్యంగా మారిన వీధులు, రహదారులు

కేంద్ర ప్రభుత్వ రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై దండెత్తిన విపక్షాలు

అనంతపురం,సెప్టెంబరు27(ఆంధ్రజ్యోతి):కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కర్షక, కార్మిక, ప్ర జా వ్యతిరేక విధానాలపై విపక్షాలు, ప్రజా సంఘాలు దుమ్మెత్తిపోశాయి. ఆ వర్గాలపై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వైఖరిని నిరసిస్తూ సోమవారం నిర్వహించిన భారత బం ద్‌ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాలతో పాటు మం డల కేంద్రాల్లోనూ వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, పెట్రోల్‌ బం కులు, సినిమా హాళ్లు స్వచ్ఛందంగా మధ్యా హ్నం వరకూ మూతపడ్డాయి. దీంతో వీధులు, ప్రధాన రహదారులు బోసిపోయాయి. వివిధ వర్గాల ప్రజలు బంద్‌కు సహకరిం చారు. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకూ డిపోలకే పరిమితం కావడంతో బస్టాండులన్నీ ఖాళీగా కనిపించాయి. జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు పూర్తి స్థాయిలో ఆగిపోయా యి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకూ బంద్‌ సందర్భంగా ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. బీజేపీయేతర పార్టీలు టీడీపీ, కాంగ్రెస్‌, వామపక్షాలు, ఆయా పార్టీల అనుబంధ సంఘాలతో పాటు ప్రజా, కార్మిక సంఘాలు ప్రత్యక్షంగా బంద్‌లో భాగస్వాములు కావడంతో జిల్లా బంద్‌ విజయవంతమైంది. 


అనంతపురంలో సీపీఎం ఆధ్వర్యంలో గొర్రు లాగుతూ నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు

కదం తొక్కిన కామ్రేడ్లు.. తెలుగు తమ్ముళ్లు...

భారత బంద్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా కామ్రేడ్లు, తెలుగు తమ్ముళ్లు కదం తొక్కారు. ఎక్కడికక్కడ నిరసన చేపట్టారు. బైకు ర్యాలీల తో వీధులు, రహదారులను హోరెత్తించారు. మరోవైపు మేము సై తమంటూ కాంగ్రెస్‌, కర్షక, కార్మిక, ప్రజా సం ఘాల నాయకులు బంద్‌లో భాగస్వాములయ్యారు. కేం ద్ర ప్రభుత్వం తీసుకున్న రై తు, ప్రజా వ్యతిరేక విధా నా లపై దుమ్మెత్తిపోశారు. రైతు, కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలతో పాటు పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న పె ట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించేంత వరకూ పో రాటం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రధాని మోదీ నియంతృత్వ వైఖరిని తూర్పార బట్టా రు. జిల్లా కేంద్రంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రెడ్డి కాడెద్దుల్లాగా గొర్రుతో రో డ్డుపై దు న్నుతూ నిరసన వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లాకార్యదర్శి జగదీష్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణు లు నగరంలోని ప్రధాన రహదారులపై భారీ ర్యాలీ నిర్వహించాయి. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధక్షుడు బండ్లపల్లి ప్రతా్‌పరెడ్డి, ఆ పార్టీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు దాదాగాంధీ, ఎస్సీ సెల్‌ రాష్ట్ర వైస్‌చైర్మన శంకర్‌ ఆధ్వర్యం లో వారి పార్టీ జెండాలతో ప్రధాన రహదారులపై భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. చంద్రదండు   ప్రకా్‌షనాయుడు ఆధ్వర్యంలో వాహనాల్లో ర్యాలీగా వెళ్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు.  మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి వర్గీయులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించగా, ఆ పార్టీ అనంతపురం పార్లమెంటు ఇనచార్జ్‌ జేసీ పవనరెడ్డి వర్గీయులు నగరంలోని ప్రధాన రహదారుల్లో భారీ బైకు ర్యాలీతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగసంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ... బంద్‌లో భాగంగా ఆర్టీసీ ఎనఎంయూ నాయకులు డిపో వద్ద నిరసన వ్యక్తం చేశారు. హిందూపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి నేతృత్వం లో ఆ పార్టీ శ్రేణులు వామపక్షాలతో కలిసి పెనుకొండలో నిరసన వ్యక్తం చేశారు. ఇలా ఎక్కడికక్కడ నియోజకవర్గ కేంద్రాలు, మ ండల కేంద్రాల్లో నూ స్థానిక టీడీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ ఇతర ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో రాస్తారోకోలు, నిరసన ర్యాలీలు చేపట్టారు.  


అనంతపురంలో సీపీఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ


బస్సులు డిపోకే పరిమితం కావడంతో ఖాళీగా ఉన్న అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌

మద్దతిచ్చినా.. బంద్‌లో పాల్గొనని వైసీపీ

రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలనే ఏకైక డిమాండ్‌తో దేశ వ్యాప్త రైతు సంఘాలు చేప ట్టిన భారత బంద్‌కు అధికార వైసీపీ మద్దతిచ్చింది. ఆ మేరకు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఆ పార్టీ అధినాయకత్వమూ బంద్‌కు మద్దతిచ్చినప్పటికీ జిల్లాలో ఆ పార్టీ నాయకులు గానీ శ్రేణులు గానీ ప్రత్యక్షంగా బంద్‌లో పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారడం గమనార్హం.