అమెరికా దృష్టికి భారతీయ విద్యార్థుల ఆందోళన

ABN , First Publish Date - 2021-06-10T10:22:49+05:30 IST

కోవాగ్జిన్ తీసుకొన్న భారతీయ విద్యార్థులను అమెరికాలోని విద్యా సంస్థలు మళ్లీ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరుతున్నట్టు కేంద్రం దృష్టికి వచ్చిన నేపథ్యంలో.. భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్

అమెరికా దృష్టికి భారతీయ విద్యార్థుల ఆందోళన

రీవ్యాక్సినేషన్ అంశంపై స్పందించిన కేంద్రం

న్యూఢిల్లీ, జూన్9: కోవాగ్జిన్ తీసుకొన్న భారతీయ విద్యార్థులను అమెరికాలోని విద్యా సంస్థలు మళ్లీ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరుతున్నట్టు కేంద్రం దృష్టికి వచ్చిన నేపథ్యంలో.. భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా ఈ విషయాన్ని అమెరికా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై సంబంధిత యూనివర్సిటీ పరిధిలో ఉన్నందున.. అమెరికా నుంచి ఎలాంటి కచ్చితమైన హామీ రాలేదని తెలిసింది. అయితే భారతీయ విద్యార్థుల ఆందోళనను అమెరికా దృష్టికి తీసుకెళ్లడానికి డేనియల్ స్మిత్ అంగీకరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి పొందిన జాబితాలో కోవాగ్జిన్ లేకపోవడంతో అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 


Updated Date - 2021-06-10T10:22:49+05:30 IST