Advertisement
Advertisement
Abn logo
Advertisement

సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన

అనంతపురం: పట్టణంలోని సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేశారు. వర్సిటీలో బైఠాయించి వైస్ ఛాన్స్‌లర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హాస్టల్ వసతి, మౌలిక సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఫీజు రాయితీ కల్పించాలని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఫీజు రాయితీ కల్పించాలంటూ వీసీ ఛాంబర్ ముందు విద్యార్థులు బైఠాయించారు. విద్యార్థులతో ఎస్ఏఏ కోరి చర్చిస్తున్నారు. మూడు సంవత్సరాలుగా హాస్టల్ వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ వీసీ దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు. ఎటువంటి సంఘటనలు జరుగకుండా సెంట్రల్ యూనివర్సిటీకి పోలీస్ బలగాలు చేరుకున్నాయి. Advertisement
Advertisement