కుదింపుపై ఆందోళన

ABN , First Publish Date - 2021-12-06T06:31:09+05:30 IST

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బందిని కుదిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం 143 వైద్యఆరోగ్య శాఖ ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది.

కుదింపుపై ఆందోళన
కుదింపు జీఓ 143ను వ్యతిరేకిస్తూ జిల్లా వైద్యశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న వైద్య ఉద్యోగులు

పీహెచసీ సిబ్బందిని తగ్గిస్తూ ఉత్తర్వులు

సూపర్‌వైజర్‌ కేడర్‌ పోస్టులు గల్లంతు

జీఓ 143పై మండిపడుతున్న వైద్య ఉద్యోగులు

ఉపసంహరించుకోవాలని ఉద్యమ బాట

అనంతపురం వైద్యం, డిసెంబరు 5: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బందిని కుదిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం 143 వైద్యఆరోగ్య శాఖ ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 12 మంది మాత్రమే విధులు నిర్వర్తించాలనడంతో పీహెచసీల్లో విధులు నిర్వహిస్తున్న మిగిలిన కేడర్‌ ఉద్యోగులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పీహెచసీలో విధులు నిర్వహిస్తున్న 18 మంది సిబ్బందిలో ఐదు లేదాఆరుగురిని తొలగించే కసరత్తు 10 రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర సంచాలకులు ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్యో గుల్లో చర్చ మొదలైంది. ఇది వరకు  ప్రతి పీహెచసీలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు స్టాఫ్‌ నర్సులు, ఒక ల్యాబ్‌ టెక్నీషియన, ఫార్మాసిస్టు, ఒక ఎఫ్‌ఎనఓ, ఒక స్వీపర్‌, ఎల్డీ కంప్యూటర్‌ ఆపరేటర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌లతో పాటు క్షేత్ర స్థాయి పర్యవేక్షణ కోసం పురుష, మహిళా పర్యవేక్షకులు, నర్స్‌, సామాజిక ఆరోగ్యాధికారి, పారా మెడికల్‌ అధికారి ఉండేవారు. ఇందులో డాక్ట ర్లు, స్టాఫ్‌  నర్సు లు, ఎఫ్‌ఎనఓ, ఎల్డీ కంప్యూటర్‌, ఫార్మాసిస్టు, స్వీపర్లు పీహెచసీల్లో ఉంటూ సేవలందించేవారు. జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లు పీహెచసీ పరిధిలో ఉద్యోగుల జీతాలు, బిల్లులు వ్యవహారాలు చూసేవారు. పీహెచసీ పరిధిలో పురుష, మహిళా పర్యవేక్షకులు, ఆరోగ్య విస్తరణాధికారి, ఆరోగ్య బోధకుడు, పబ్లిక్‌ హెల్త్‌నర్స్‌, సామాజిక ఆరోగ్యాధికారి, పారామెడికల్‌ సేవలు అం దించేవారు. ఈ కేడర్‌ పోస్టులను కుదిస్తూ ప్రభుత్వం తాజాగా జీఓ నెం 143 జారీ చేయడంతో జిల్లాలోని పీహెచసీల కన్నా నాలుగింతల పర్యవేక్షణ సిబ్బంది మిగిలిపోనున్నారు. మిగులు సిబ్బందిని ఏమి చేస్తారో స్పష్టత లేక ఉద్యోగుల్లో ఆందో ళన మొదలైంది. 


సూపర్‌వైజర్‌  కేడర్‌ పోస్టులు గల్లంతు

జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 260కి పైగా ఉపకేంద్రాలు ప్రజలకు సే వ లందిస్తున్నాయి. గ్రామ స్థాయి ఆరోగ్య ఉప కేం ద్రంలో  పని చేసే ఆరోగ్య సహాయకుడిని 4 ఉపకేంద్రాలకు పర్యవే క్షకుడిగా, ఉద్యోగోన్నతిపై పీహెచసీ స్థాయి ఆరోగ్య విస్తర ణాధికారిగా నియమిస్తారు. అదే మహిళా పర్యవేక్షకురా లైతే పబ్లిక్‌ హెల్త్‌ నర్స్‌గా ప్రమోషన వస్తుంది. తదుపరి గెజిటెడ్‌ స్థాయి సామాజిక ఆరోగ్యాధికారిగా ఉద్యోగోన్నతి పొందాల్సి ఉంటు ంది. ఆరోగ్య విద్యా బోధకులు క్షేత్ర స్థాయికి వెళ్లి ఆ రోగ్య సూత్రాలను ప్రజలకు వివరించాలి. కానీ వీరేవరూ క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదనే ఆరోప ణలున్నాయి. పారామెడికల్‌ అధికారి ఉన్పప్పటికీ వీరు కు ష్ఠు, ఎయిడ్స్‌ బాధితులను మాత్రమే చూస్తున్నారు. ఎల్డీ కంప్యూటర్‌ ఆపరేటర్‌ లేదా జూనియర్‌ లేదా సీనియర్‌ అసిస్టెంట్‌లలో ఒక పోస్టు మాత్రమే ఉండనుం ది. క్షేత్ర స్థాంుులో విధులు నిర్వహించడానికి పురుష, మహిళా పర్యవేక్షకులు, ఆరోగ్య విస్తరణాధికారి, ఆరోగ్య బోధకుడు, పబ్లిక్‌ హెల్త్‌ నర్స్‌, పారామెడికల్‌ అధికారులు ఐదు కేడర్‌ పోస్టులకు గాను ఏదేని ఒక పోస్టు మాత్రమే ఉంటుంది. నిజానికి ప్రతి పోస్టుకు వేర్వేరు శిక్షణలు, అర్హతలు, విధులున్నాయి. అన్ని పనులు ఎవ రో ఒకరు ఎలా నిర్వహించగలరు అనేది ప్రశ్నార్థకమే. ఇంత కీలకమైన ఉత్తర్వులు జారీ చేయడానికి ముం దు ఉద్యోగ సంఘాలతో ఎలాంటి సంప్రదింపులు చేయకుండా పోస్టులు కుదించడంపై వైద్యఆరోగ్య ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. జీఓను ఉపసంహరించుకోవాలని ఉద్యమ బాట పడుతున్నాయి. 


          ఇది నియంతృత్వ నిర్ణయం

జీఓ 143 నిర్ణయం నియంతృత్వమే. గతంలో ఎప్పుడూ వైద్య శాఖలో సర్దుబాటు లేదు. కొత్తగా పెట్టేటప్పుడు కనీ సం ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకోలేదు. ఏకపక్షంగా కు దింపు జీఓ ఇవ్వడం దుర్మార్గం. ఐదు కేడర్ల సూపర్‌వైజర్లు క్షేత్రస్థాయిలో పనిఒత్తిడితో చస్తున్నారు. ఇప్పుడు ఒకరినే ఉంచుతున్నారు. ఆ ఒక్కరే ఎలా చేస్తారో జీఓ ఇచ్చిన అధి కారులకే తెలియాలి. కుదింపు నిర్ణయం సరికాదు. ఉప సంహరించుకోవాల్సిందే. 

-  బాబాసాహెబ్‌, పబ్లిక్‌ హెల్త్‌ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన రాష్ట్ర కార్యదర్శి

Updated Date - 2021-12-06T06:31:09+05:30 IST