బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన

ABN , First Publish Date - 2022-03-09T06:39:04+05:30 IST

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం సిరిసిల్ల పట్టణ బీజేపీ కమిటీ అధ్యక్షుడు అన్నల్‌దాస్‌ వేణు అధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహం ఎదుట ఆందోళనలు చేపట్టి సీఎం దిష్టిబొమ్మను దహనం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకుంటున్న పోలీసులు

సిరిసిల్ల రూరల్‌, మార్చి 8: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం సిరిసిల్ల పట్టణ బీజేపీ కమిటీ అధ్యక్షుడు అన్నల్‌దాస్‌ వేణు అధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహం ఎదుట ఆందోళనలు  చేపట్టి సీఎం దిష్టిబొమ్మను దహనం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అగ్రహించిన నాయకులు ప్రధాన రహదారిపై బైటాయించగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈసందర్భంగా అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అమలు చేయని ముఖ్యమంత్రి కేసీఅర్‌ నిమంతృత్వ వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. దళిత మోర్చా రాష్ట్ర కమిటీ సభ్యుడు కమలాకర్‌, ఓబీసీ మోర్చా కమిటీ సభ్యుడు నవీన్‌యాదవ్‌, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌, పట్టణ ఉపాధ్యక్షులు  రాంప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌,  మైసయ్య,  పర్శరాములు, నరేష్‌ పాల్గొన్నారు. 

 ఎల్లారెడ్డిపేటః శాసన సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేను ప్రభుత్వం సస్పెన్షన్‌ చేయడంపై ఆ పార్టీ నాయకులు సమరానికి దిగారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నాయకులు మంగళవారం ఆందో ళన చేపట్టారు. మండల కేంద్రంలోని కొత్త బస్టాండు సమీపంలో  సెంట్రల్‌ లైటింగ్‌పె సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మకు ఉరి వేసి నిరసన తెలిపారు.  అనంత రం నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఏఎస్సై కిషన్‌రావు ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్నారు.  పోలీసులు, నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  ఏఎస్సై కిషన్‌రావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నాయకులు మళ్లీ రోడ్డుపై బైఠాయించారు.  పోలీస్‌ స్టేషన్‌ ముట్టడికి యత్నించారు.  నాయకులు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట రాస్తారోకో చేపట్టారు. అనంతరం సీఐ మొగిలి, ఎస్సెస శేఖర్‌ నిరసనకారులకు నచ్చజెప్పడంతో నాయకులు శాంతించారు. నాయకులు గొపి, తిరుపతిరెడ్డి, రామచంద్రారెడ్డి, గణేశ్‌, సాయిలు, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

 గంభీరావుపేట: గంభీరావుపేట మండల కేంద్రంలో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు గంట అశోక్‌, జిల్లా అథికార ప్రతినిది దెవసాని కృష్ణ, కిసాన్‌ మోరా అధ్యక్షుడు కోడె రమేష్‌, యువమోర్చా అధ్యక్షుడు తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు పర్షాగౌడ్‌, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి విగ్నేష్‌, నాయకులు ఉన్నారు. 

 తంగళ్లపల్లి: తంగళ్లపల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొ మ్మ దహనం చేశారు.అంబేద్కర్‌ విగ్రహనికి పూల మాలలు వేశారు. బీజేపీ మండల  అధ్యక్షుడు వెంకటి, ఎంపీటీసీ రాము, రాజీ తదితరులు ఉన్నారు.

 వేములవాడ టౌన్‌: వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని నందికమాన్‌ చౌర స్తావద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు ఎర్రం మహేష్‌ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పార్టీ మండల అధ్యక్షుడు నర్సయ్య, నాయ కులు  శేఖర్‌,  అరుణ్‌,  ప్రశాంత్‌,  భాస్కర్‌, అంజయ్య తదితరులు ఉన్నారు. 

 కోనరావుపేట:మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు గొట్టె రామచంద్రం,  వెంకటి, మోహన్‌,  లింబయ్య, మహేష్‌, నాగరాజు, పర్శరాములు పాల్గొన్నారు.

 బోయినపల్లి : అసేంబ్లీ సమావేశాల నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను నిరసిస్తూ బోయినపల్లి మండల కేంద్రంలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మతను దగ్ధం చేశారు.బీజేపీ మండల అధ్యక్షుడు గూడి రవీందర్‌రెడ్డి, నాయకులు ముదారి నర్సింహాచారి, పర్శరాం, వెంకటేష్‌, కొనకటి హరీష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-09T06:39:04+05:30 IST