సింగరేణి ప్రమాదంపై ‘ఖని’లో ఆందోళనలు

ABN , First Publish Date - 2020-06-03T10:05:12+05:30 IST

సింగరేణి ఆర్‌జీ ఓపెన్‌కాస్టు-1 ఫేస్‌-2లో మంగళవారం ఉదయం జరిగిన భారీ పేలుడులో చనిపోయిన కాంట్రాక్టు కార్మిక మృతదేహాలను ‘ఖని’

సింగరేణి ప్రమాదంపై ‘ఖని’లో ఆందోళనలు

కోటి రూపాయలు, సింగరేణి పర్మనెంట్‌ ఉద్యోగం ఇవ్వాలి 

సింగరేణి ఏరియా ఆసుపత్రి ఎదుట కార్మిక సంఘాల ధర్నా 


గోదావరిఖని, జూన్‌ 2: సింగరేణి ఆర్‌జీ ఓపెన్‌కాస్టు-1 ఫేస్‌-2లో మంగళవారం ఉదయం జరిగిన భారీ పేలుడులో చనిపోయిన కాంట్రాక్టు కార్మిక మృతదేహాలను ‘ఖని’ సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో బాధిత కుటుంబాలు, కార్మి క సంఘాల నాయకులు భారీ ఎత్తున ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. భారీ పేలుడుకు శరీరాలు గుర్తుపట్టని రీతిలో కార్మికుల మృతదేహాలు ఉండ డం, గాయపడిన వారికి కళ్లు, కాళ్లు విరిగిపోవడం, వారి కుటుంబాల రోదనలు ఏరియాఆసుపత్రి పరి సరాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలకు చెందిన రామగుండం రీ జియన్‌ పరిధిలోని నాయకులు ఏరియా ఆసుపత్రి కి తరలివచ్చారు. సింగరేణి యాజమాన్యం, ప్రైవేట్‌ ఓబీ కంపెనీలు కుమ్మక్కై ఉత్పత్తి మినహా కార్మికు ల జీవితాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నే ఈ ప్రమాదం జరిగిందని, ఈ మరణాలకు మ హాలక్ష్మి కంపెనీ, సింగరేణి యాజమాన్యమే బాధ్య త వహించాలని డిమాండ్‌ చేశారు.


సింగరేణి ఏరి యా ఆసుపత్రి ఆవరణలో ధర్నాకు దిగారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల న ష్టపరిహారం చెల్లించాలని, మృతిచెందిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి సింగరేణిలో పర్మినెంట్‌ ఉద్యో గం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయం తేలేవరకు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం వరకు మృతదేహాలకు పోస్టుమార్టం జరగలేదు. మృతులు బండారి ప్రవీణ్‌కుమార్‌(38), గోదావరిఖని, బిళ్ల రాజేశం(42)కమాన్‌పూర్‌, అంజయ్య(41) కమాన్‌పూర్‌, రాకేష్‌(28) గోదావరిఖని మృతదేహాలకు పోస్టమార్టం జరగాల్సి ఉంది. 


ఏరియా ఆసుపత్రికి నేతల తాకిడి

ఓసీపీ-1లో జరిగిన ప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబాలను పరామార్శించేందుకు సింగరేణి ఏరియా ఆసుపత్రికి ప్రాంతానికి చెందిన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, తదితర పార్టీల ప్రజా ప్ర తినిధులు, నాయకులు తరలివచ్చారు. కార్మికుల మృతదేహాలను పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశా రు. ప్రమాదంపై దిగ్ర్భాంతిని తెలియజేసి కార్మిక కుటుంబాలకు సంతాపం వెలిబుచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీల నాయకులు మృతిచెందిన కార్మిక కుటంబాలకు రూ.50లక్షల నష్టపరిహారంతో పాటు ఉద్యో గం కల్పించాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్మిక కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. సంఘటన తెలుసుకున్న పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌నేత, జడ్పీ చై ర్మన్‌ పుట్ట మధు, రామగుండం ఎమ్మెల్యే కోరుకం టి చందర్‌, రామగుండం మేయర్‌ డాక్టర్‌ అనీల్‌కుమార్‌, టీబీజీకేఎస్‌ నాయకులు మిర్యాల రాజిరెడ్డి ఆసుపత్రికి వచ్చి కార్మిక కుటుంబాలను పరామర్శించారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మంథని ఎమ్మె ల్యే శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, రామగుండం ఇన్‌చార్జి రాజ్‌ఠాకూర్‌, ఐఎన్‌టీయూసీ నాయకులు బీ జనక్‌ప్రసాద్‌, నర్సింహారెడ్డి తదితరులు ఉన్నా రు. బీజేపీ  జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ, బీఎంఎస్‌ నాయకులు కే మల్లయ్య, కౌశిక హరి, ఏఐటీయూసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, ఎల్‌ ప్రకాష్‌, హెచ్‌ఎంఎస్‌ నాయకుడు రి యాజ్‌ అహ్మద్‌, సీఐటీయూ అధ్యక్షుడు రాజారెడ్డి, యాకయ్య, ఐఎఫ్‌టీయూ నాయకులు నరేష్‌,  సీపీ ఐ నాయకులు గౌతం గోవర్ధన్‌ ఉన్నారు. 


పత్తాలేని ‘మహాలక్ష్మి’.. పట్టించుకోని సింగరేణి..

ఓసీపీ-1లో ఓబీ పనులు నిర్వహించే మహాలక్ష్మి కంపెనీలో పనిచేసే కార్మికులు ప్రమాదం బారిన పడగా, కంపెనీకి చెందిన ఒక్క ప్రతినిధి పట్టించు కోలేదు. ప్రిన్సిపల్‌ ఆఫ్‌ ఎం ప్లాయర్‌గా వ్యవహరించాల్సిన బాధ్యత కలిగిన సింగరేణి యాజమాన్యం కూడా ఏమి పట్టనట్టుగా వ్యవహరించింది. దీనిపై కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. 


Updated Date - 2020-06-03T10:05:12+05:30 IST