హక్కుల కోసం పోరాడితే అక్కమ కేసులా?

ABN , First Publish Date - 2021-06-16T09:03:49+05:30 IST

రాష్ట్ర రాజధాని అమరావతి కోసం జీవనాఽధారమైన భూములు ఇస్తే, రెండేళ్ల నుంచి అన్నదాతను ప్రభుత్వం నడిరోడ్డుపై నిలబెట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు, మహిళలు

హక్కుల కోసం పోరాడితే అక్కమ కేసులా?

546వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు


తుళ్లూరు, జూన్‌ 15: రాష్ట్ర రాజధాని అమరావతి కోసం జీవనాఽధారమైన భూములు ఇస్తే, రెండేళ్ల నుంచి అన్నదాతను ప్రభుత్వం నడిరోడ్డుపై నిలబెట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న ఉద్యమం మంగళవారం నాటికి 546వ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు కోట్ల మంది అమరావతిని కోరుతుంటే స్వలాభం కోసం పాలకులు మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారన్నారు. అదేమంటే మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదాతో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని తెలిసినా.. కేంద్రం వద్ద దానిని అడగలేని పరస్థితి ప్రస్తుత సీఎం జగన్‌రెడ్డిదన్నారు. కేసుల మాఫీ కోసం ఢిల్లీ పర్యటలు తప్పితే రాష్ట్ర అభివృద్ధి కోసం ఏనాడు వెళ్లలేదన్నారు. కేంద్రం మెడలు వంచి అయినా విభజన చట్టంలోని హామీలను, ప్రత్యేక హోదా తెస్తామని ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు ఏమైయ్యాయని ప్రశ్నించారు. మూడు ముక్కల ఆట ఆడటంతో రాష్ట్ర వెనకబడి పోయిందన్నారు. రాజధాని కోసం చట్టబద్దంగా భూములు ఇస్తే అభివృద్ధి చేయక పోగా, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతనైతే ప్రత్యేక హోదా తెచ్చి మూడు ప్రాంతాల అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. దీపాలు వెలలిగించి అమరావతికి వెలుగు ప్రసాదించాలని నినాదాలు చేశారు. పాలకులు అన్యాయం చేస్తున్నారని, న్యాయదేవత తమను రక్షించాలని వేడుకున్నారు. జై అమరావతి అంటూ రైతు ధర్నా శిబిరాల నుంచి, ఇళ్ల నుంచి ఆందోళనలు కొనసాగించారు.

Updated Date - 2021-06-16T09:03:49+05:30 IST