విద్యాసంస్థలు తెరవాలని విద్యార్థి సంఘాల ఆందోళనలు

ABN , First Publish Date - 2022-01-18T23:09:45+05:30 IST

విద్యాసంస్థలు తెరవాలని విద్యార్థి జనసమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిప్పకుర్తి శ్రీనివాస్‌ అన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలో విద్యార్థి

విద్యాసంస్థలు తెరవాలని విద్యార్థి సంఘాల ఆందోళనలు

ఏసీసీ, జనవరి 17: విద్యాసంస్థలు తెరవాలని విద్యార్థి జనసమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిప్పకుర్తి శ్రీనివాస్‌ అన్నా రు.  సోమవారం జిల్లా కేంద్రంలో విద్యార్థి జనసమితి, ట్రస్మా ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. కరోనా పేరుతో పేద విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను దూరం చేస్తున్నాయన్నారు. బార్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, రాజకీయ పార్టీల మీటింగ్‌లు పెడితే విస్తరించని కరోనా విద్యాసంస్థల్లో ఎలా విస్తరిస్తుందని ప్రశ్నించారు. జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌, సమ్మయ్య, రవితేజ పాల్గొన్నారు. 

పాఠశాలలకు సెలవులు పొడిగించడాన్ని నిరసిస్తూ ట్రస్మా ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. హెడ్‌పోస్టాఫీసు ఎదుట ట్రస్మా నాయకులు విద్యార్థులతో కలిసి విద్యాసంస్థలను తెరవాలని ముఖ్యమంత్రికి పోస్టు కార్డులు పంపారు. నాలుగు నెలల వ్యవధిలోనే  పాఠశా లలు మూసివేయడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ట్రస్మా జిల్లా అధ్యక్షుడు రాపోలు విష్ణువర్ధన్‌రావు, కస్తూరి పద్మచరణ్‌, ఉస్మాన్‌పాషా, బాల మల్లయ్య, సత్తయ్య, దుర్గ ప్రసాద్‌ పాల్గొన్నారు. 


విద్యాసంస్థలకు సెలవులను పొడిగించడం సరికాదని డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమేష్‌, మోతె జయకృష్ణలు అన్నారు. సెలవుల పొడిగిం పునకు సంబంధించి ఏకపక్షంగా నిర్ణయం తీసుకొన్నారన్నారు. చెన్నూరు: విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉం చుకుని ప్రైవేటు పాఠశాలలను ప్రభుత్వం ప్రారంభించా లని ట్రస్మా ఆధ్వర్యంలో ఎంఈవో కార్యాలయం ఎదుట నిరసన  చేపట్టారు.  పాఠశాలలు మూసి ఉంచడంతో విద్యార్థులు ఆందోళనలకు గురవుతారని పేర్కొన్నారు.  ఎంఈవోకు వినతిపత్రం అందించారు.   శ్యాం సుంద ర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రావు, సురేష్‌  పాల్గొన్నారు. 

దండేపల్లి : కరోనా నిబంధనల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు పొడిగించడాన్ని నిరసిస్తూ ట్రస్మా మండల శాఖ ఆధ్వర్యంలో విద్యార్ధులు, కరస్పాం డెంట్లు, ఉపాధ్యాయులు పోస్టుకా ర్డుల ఉద్యమంతో నిరసన చేప ట్టారు. బార్లు, రెస్టారెంట్‌ల దగ్గర రాని కరోనా పాఠశాలల వద్ద వస్తుందా అని మండిపడ్డారు.    సీఎం కేసిఆర్‌ విద్యాసంస్ధలను పునఃప్రారం భించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-01-18T23:09:45+05:30 IST