పెద్దతండాలో మద్య నిషేధానికి తీర్మానం

ABN , First Publish Date - 2020-02-28T10:52:41+05:30 IST

రేగోడు మండలంలోని పెద్దతండాలో మద్యం నిషేధిస్తూ సర్పంచ్‌ సుగుణ, ఉపసర్పంచ్‌ సంగ్య నాయక్‌ ఆధ్వర్యంలో గ్రామస్థులు గురువారం తీర్మానం చేశారు.

పెద్దతండాలో మద్య నిషేధానికి తీర్మానం

 రేగోడు ఫిబ్రవరి 27: రేగోడు మండలంలోని పెద్దతండాలో మద్యం నిషేధిస్తూ  సర్పంచ్‌ సుగుణ, ఉపసర్పంచ్‌ సంగ్య నాయక్‌ ఆధ్వర్యంలో గ్రామస్థులు గురువారం తీర్మానం చేశారు. మద్యం అమ్మిన, తాగి దూషించిన కేసులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని  ఎస్‌ఐ కాశీనాథ్‌కు తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. మద్యం వల్ల జరిగే అనర్థాలను తెలుసుకొని తండావాసులు కలిసికట్టుగా మద్యం నిషేధించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మద్యం నిషేధానికి గ్రామాలు, తండాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాగా రేగోడు మండలంలో కొత్వాల్‌పల్లి, తిమ్మాపూర్‌, మర్పల్లి, ఆర్‌ ఇటిక్యాల గ్రామాల్లో మద్యం నిషేధించారు. 

Updated Date - 2020-02-28T10:52:41+05:30 IST