జ్వరాలపై సర్వే నిర్వహించండి

ABN , First Publish Date - 2021-04-16T05:04:01+05:30 IST

కరోనా ఉధృతి నేపథ్యంలో గ్రామాల్లో జ్వరాలపై సర్వే నిర్వహించాలని వలంటీర్లను కంచిలి తహసీల్దార్‌ కె.వెంకటరావు కోరారు.

జ్వరాలపై సర్వే నిర్వహించండి
కంచిలి: డీజీపురంలో మాట్లాడుతున్న తహసీల్దార్‌ వెంకటరావు

కంచిలి:కరోనా ఉధృతి నేపథ్యంలో గ్రామాల్లో జ్వరాలపై సర్వే నిర్వహించాలని వలంటీర్లను కంచిలి తహసీల్దార్‌ కె.వెంకటరావు కోరారు.గురువారం ఎంఎస్‌పల్లి, జలంత్రకోట, డీజీపురం గ్రామ సచివాలయాలల్లో వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు.కరోనా ప్రభావం అధికంగా ఉండడంత ప్రజలు అవగాహనతో మెలిగేలా చర్యలు చేపట్టాలని కోరారు.కార్యక్రమంలోఆర్‌ఐ రమణమూర్తి పాల్గొన్నారు.

మాస్కు లేకపోతే బస్సు ఎక్కించం..

పాలకొండ: మాస్క్‌ లేనిదే బస్సు ఎక్కించబోమని, టిక్కెట్‌ కూడా ఇవ్వవద్దని కండక్టర్లకు ఆర్టీసీ డీఎం సత్యనారాయణ మూర్తి సూచించారు. పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రయాణికులకు కరోనాపై అవగా హన కల్పించారు.ఫ బూర్జ: కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని పీహెచ్‌సీ వైద్యాధికారి పావని తెలిపారు. గురువారం బూర్జ మండల సమాక్య కార్యాలయంలో సమావేశం నిర్వహిం చారు. కార్యక్రమంలో ఏపీవో కూర్మారావు, ఎంఎంఎస్‌ అధ్యక్షురాలు రామ, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఫ పోలాకి: విద్యార్థులు మాస్క్‌ ధరించి, భౌతికదూరం పాటించాలని గుప్పెడుపేట పీహెచ్‌సీ సచివాలయ వైద్య సిబ్బంది పి.నాగమణి సూచించారు. గాతలవలస ప్రాఽథమికోన్నత పాఠశాల విద్యార్థులకు కొవిడ్‌పై అవగాహన కల్పించా రు. ఫ జలుమూరు: కరోనా వ్యాక్సిన్‌పై ఎటువంటి అపోహలకు తావులేదని  ఏపీఎంవో వాన సురేష్‌ కుమార్‌ తెలిపారు. గురువారం జలుమూరులొ సీఎఫ్‌లతో సమీక్షించారు. సమావేశంలో ఏపీఎం అప్పలరామయ్య, హెచ్‌వీ ఈశ్వరమ్మ, ఏఎన్‌ఎం సరోజిని పాల్గొన్నారు. ఫ ఇచ్ఛాపురం: కరోనాపై అప్రమత్తంగా ఉండాలని యువ సూర్యా చారిట బుల్‌ ట్రస్టు చైర్మన్‌ ఎం.రాంబాబు తెలిపారు. ఇచ్ఛాపురంలోని లాలాపేటలో కరోనాపై అవగాహన కల్పించారు.


 


Updated Date - 2021-04-16T05:04:01+05:30 IST