కోండీల్స్‌, ఆంబ్రోసియా నుంచి ఇమ్యూనిటీ బూస్టర్‌ ఔషధాలు

ABN , First Publish Date - 2020-10-20T07:20:25+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన కోండీల్స్‌.. కార్డిసెప్స్‌ క్యాప్యూల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఇమ్యూనిటీ బూస్టర్‌ ఔషధాలను ఆంబ్రోసియా ఫుడ్‌ ఫామ్‌తో కలిసి తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది. సోమవారం నాడిక్కడ ఇరుసంస్థల ప్రతినిధులు గౌరవేంద్ర గంగ్వార్...

కోండీల్స్‌, ఆంబ్రోసియా నుంచి ఇమ్యూనిటీ బూస్టర్‌ ఔషధాలు

న్యూఢిల్లీ  (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు చెందిన కోండీల్స్‌.. కార్డిసెప్స్‌ క్యాప్యూల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఇమ్యూనిటీ బూస్టర్‌ ఔషధాలను ఆంబ్రోసియా ఫుడ్‌ ఫామ్‌తో కలిసి తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది. సోమవారం నాడిక్కడ ఇరుసంస్థల ప్రతినిధులు గౌరవేంద్ర గంగ్వార్‌, అతిక్‌ పటేల్‌, ప్రకాశ్‌ పెండెం ఈ క్యాప్యూల్స్‌ను విడుదల చేశారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో మాత్రమే లభించే పుట్టగొడుగులతో దీన్ని తయారు చేశామని, ఇందులో యాంటీ వైరల్‌ గుణాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. భోపాల్‌, నాగ్‌పూర్‌ ఎయిమ్స్‌లతో పాటు ముంబైలోని  ఒక హాస్పిటల్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ను నిర్వహించామని, త్వరలోనే దీన్ని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు చెప్పారు. కాగా పుట్టగొడుగులను ఉపయోగించి ద్రవరూపంలో తయారు చేసిన మరో ఇమ్యూనిటీ బూస్టర్‌ను ఈ నెల 22 న హైదరాబాద్‌లో సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా ఆవిష్కరిస్తారని వెల్లడించారు. 

Updated Date - 2020-10-20T07:20:25+05:30 IST