రసాభసగా పౌరహక్కుల దినోత్సవం

ABN , First Publish Date - 2021-11-30T05:30:00+05:30 IST

మదనపల్లె మండలంలోని సీటీఎంలోని చెంచులక్ష్మీకాలనీలో నిర్వ హించిన పౌరహక్కుల దినోత్సవం రసాభాసగా మారింది.

రసాభసగా పౌరహక్కుల దినోత్సవం
తహసీల్దార్‌తో వాదిస్తున్న పీఆర్‌ ఏఈ రమణ

అధికారుల మధ్య వాగ్వాదం


మదనపల్లె రూరల్‌, నవంబరు 30: మండలంలోని సీటీఎంలోని చెంచులక్ష్మీకాలనీలో నిర్వ హించిన పౌరహక్కుల దినోత్సవం రసాభాసగా మారింది. తహసీల్దారు సీకే శ్రీనివాసులు అధ్యక్షతన మండలంలోని అన్ని శాఖల అధికారులు, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ కమిటీసభ్యులతో పౌరహక్కుల దినో త్సవం నిర్వహించారు. ముందుగా శాఖల వారీగా అధికారులు ప్రభుత్వం ఆయాశాఖల పరిధిలో అం దిస్తున్న సంక్షేమపథకాలను వివరించారు. ఈ క్ర మంలో పీఆర్‌ ఏఈ రమణ మాట్లాడుతూ  మండల స్థాయిలో పలుశాఖల అధికారులను స్టేజీ పైకి పిలవకుండా కూర్చున్న చోటినుంచి మాట్లాడమనడం పద్ధతి కాదంటూ తహసీల్దారును ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన తహసీల్దారు... పీఆర్‌ శాఖ గు రించి చెప్పాలని, అనవసర మాటలు మాట్లాడ వద్దన్నారు. దీంతో వారి మధ్య  వాగ్వాదం జరగ్గా,  ఇతర అధికారులు, ఎంపీపీ రెడ్డెమ్మ, సర్పంచ్‌ ఆనందపార్థసారథి సర్ది చెప్పారు. అంతకుమునుపు సభకు వచ్చిన ప్రజలు తాగునీటి సరఫరాపై అధి కారులను నిలదీయడంతో కాసేపు గందరగోళం ఏర్ప డింది. అనంతరం మురుగనీటి కాలువలు, రోడ్లు, శ్మశానవాటికకు స్థలం కేటాయించాలంటూ పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ యమలా సుదర్శనం, సీపీఐ నాయకులు కృష్ణప్ప, సాంబశివ, గిరిజన సంఘం నాయకుడు దివాకర్‌, ఎస్‌ఐ సోమశేఖర్‌, ఎంఈవో, ఏపీవో, ఏపీ ఎం, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. 


బి.కొత్తకోట: బీరంగి పంచాయతీ హరిజనవాడలో సివిల్‌ రైట్స్‌ డే సందర్భంగా  నిర్వహించిన  కార్యక్ర మానికి ఎస్‌ఐ రామ్మోహన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎస్సీ, ఎస్టీ చట్టాలు, బాల్య వివాహాలు, అణగారిన వర్గాల వెనుకబాటుతనం, అందుకు గల కారణాలను వివరించారు. తమ గ్రామానికి వచ్చి చట్టాలపైన అవగాహన కల్పించిన ఎస్‌ఐకు కృతజ్ఞతలు తెలుపుతూ హరిజనవాడ వాసులు భోజనానికి ఆహ్వానించారు. ఈ కార్యక్ర మంలో ఎమ్మార్పీఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి దమ్ము చిన్నా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-30T05:30:00+05:30 IST