Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం

నెల్లూరు: జిల్లాలోని వెంకటగిరిలో వినాయక విగ్రహ ఊరేగింపులో కాలేజీమిట్ట ప్రాంత వైసీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అల్లం సాయి అనే వైసీపీ యువజన నేతని ఎస్ఐ కొట్టి పీఎస్‌కి తరలించారంటూ కార్యకర్తలు రాద్ధాంతం చేసారు. పీఎస్ లోపలకి వైసీపీ కార్యకర్తలు దూసుకెళ్లారు. పీఎస్‌లోనే పోలీసులతో వాగ్వాదం పెట్టుకుని నినాదాలు చేసారు. 

Advertisement
Advertisement