స్టీల్‌ప్లాంట్‌ సీఎండీకు పల్లా అభినందనలు

ABN , First Publish Date - 2021-06-18T04:44:42+05:30 IST

స్టీల్‌ప్లాంట్‌ ఇన్‌చార్జి సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన కేసీ దాస్‌ను విశాఖ టీడీపీ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, స్టీల్‌ టీఎన్‌టీయూసీ నాయకులు గురువారం కలిసి అభినందనలు తెలిపారు.

స్టీల్‌ప్లాంట్‌ సీఎండీకు పల్లా అభినందనలు
కేసీ దాస్‌కు అభినందనలు తెలుపుతున్న టీడీపీ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

ఉక్కుటౌన్‌షిప్‌, జూన్‌ 17: స్టీల్‌ప్లాంట్‌ ఇన్‌చార్జి సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన కేసీ దాస్‌ను విశాఖ టీడీపీ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, స్టీల్‌ టీఎన్‌టీయూసీ నాయకులు గురువారం కలిసి అభినందనలు తెలిపారు. ఉక్కు ఉత్పత్తిని మరింత పెంచాలని, కార్మిక సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని కోరారు.  ఉక్కు నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని విన్నవించారు. సంస్థ ప్రగతికి, కార్మిక సంక్షేమానికి చేపట్టే చర్యలకు పూర్తిగా సహకరిస్తామన్నారు. కార్యక్రమంలో టీఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి కోగంటి లెనిన్‌బాబు, నాయకులు నమ్మి సింహాద్రి, పెద్దాడ సోమినాయుడు, నరేంద్ర, పొట్ల శ్రీనివాస్‌, సోమినాయుడు, రాజు, కరణం సన్ని పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T04:44:42+05:30 IST