‘కరోనా’ సేవలపై మాజీ ఎంపీ అభినందన

ABN , First Publish Date - 2020-08-13T11:01:50+05:30 IST

జిల్లాలో కరోనా పా జిటివ్‌ వచ్చిన వారికి తనవంతు సేవలు అందిస్తున్న మాజీ ఎంపీ కవిత నర్సింగ్‌ సిబ్బందికి

‘కరోనా’ సేవలపై మాజీ ఎంపీ అభినందన

జనరల్‌ ఆసుపత్రి స్టా్‌ఫ్‌ నర్సుతో

మాజీ ఎంపీ కవిత వీడియో కాల్‌లో ముఖాముఖి


నిజామాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కరోనా పా జిటివ్‌ వచ్చిన వారికి తనవంతు సేవలు అందిస్తున్న మాజీ ఎంపీ కవిత నర్సింగ్‌ సిబ్బందికి మనోధైర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. వైద్యులు, స్టాఫ్‌ నర్సులతో మాట్లాడుతూ కరోనా వచ్చిన వారికి మరింత సేవలు అం దే విధంగా చూస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో వారు సహాయం కోసం ఎలాంటి విజ్ఞప్తులు చేసినా స్పందిస్తున్నారు. కరోనా సమయంలో వారికి సహాయం అందే విధంగా చూస్తున్నారు. కరోనా మొదలయినప్పటి నుంచి జనరల్‌ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్న సిబ్బందిలో మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఆన్‌లైన్‌ జనరల్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టా్‌ఫ్‌నర్స్‌ సరిత విద్యులతతో బుధవారం మాట్లాడారు. పరిస్థితులను అడిగి తెల్సుకు న్నారు. కుటుంబాలను వదిలి కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి సేవలు అం దించడం గొప్ప విషయమన్నారు. ఐసోలేషన్‌, ఐసీయూలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కరోనా వార్డుల్లో రోజు ఎన్ని గంటలు ఉంటు న్నా రు, పీపీ కిట్లు, మందులు అందుబాటులో ఉన్నాయా అనే విషయాలను ఆరా తీశారు. నిజామాబాద్‌ జనరల్‌ ఆసుపత్రిలో నర్సింగ్‌, వైద్యులతో పాటు ఇతర సిబ్బంది అందిస్తున్న సేవలు మరువలేనివని మాజీ ఎంపీ కవిత అభినందించారు.


ఆసుపత్రిలో మొదట కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి సేవలు అందించేందుకు ఇబ్బందులు పడ్డ ప్రస్తుతం ఇబ్బందులు లేవని స్టా్‌ఫ్‌ నర్సు సరిత వివరించారు. మార్చిలో భయం ఉండేదని ప్రస్తుతం అలవాటు అయిపోయిందని అన్నారు. తనకు ముగ్గురు పిల్లలని, విధులు ముగించుకుని వెళ్లిన తర్వాత వారిని దగ్గరగా తీసుకోకపోవడం వల్ల బాధగా ఉందని, పిల్లలు ఏడ్చిన సర్ది చెబుతున్నామని అన్నారు. వారం రోజులు డ్యూటీ, మరో వారం రోజులు సెలవు ఉండడం వల్ల కొంత ఊరట ఉందన్నారు. అన్ని సమకూర్చడం వల్ల ప్రస్తుతం ఇబ్బందులు లేవని, గతంతో పోల్చితే పాజిటివ్‌ వచ్చిన వారు ఆందోళన చెందడం లేదని అన్నారు. ఇదే రీతిలో సేవలు అందించాలని, ఏం కావాల్సినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని మాజీ ఎంపీ కవిత అన్నారు. జనరల్‌ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందుతున్నాయని కొనియాడారు. 

Updated Date - 2020-08-13T11:01:50+05:30 IST