ఘనంగా విజయదశమి

ABN , First Publish Date - 2021-10-17T06:10:36+05:30 IST

కర్నూలు వన్‌టౌన్‌ ప్రాంతంలోని చిత్తారి వీధిలో దుర్గమ్మ విగ్రహ నిమజ్జన యాత్ర శనివారం వేడుకగా జరిగింది. చిత్తారి వీధి భక్త బృందం తరపున అవుటం లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు పూజా ప్రసాదాలు అందజేశారు.

ఘనంగా విజయదశమి

కర్నూలు(ఆంధ్రజ్యోతి): కర్నూలు వన్‌టౌన్‌ ప్రాంతంలోని చిత్తారి వీధిలో దుర్గమ్మ విగ్రహ నిమజ్జన యాత్ర శనివారం వేడుకగా జరిగింది.  చిత్తారి వీధి భక్త బృందం తరపున అవుటం లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు పూజా ప్రసాదాలు అందజేశారు.  


డోన్‌: డోన్‌ పట్టణంలోని అమ్మవారిశాలలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అమ్మవారి సేవలో తరించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్‌, కార్యదర్శి బచ్చు చక్రి, కోశాధికారి జొన్నలగడ్డ శ్రీనివాసులు శెట్టి తదితరులు ఆమెకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారికి కోట్ల సుజాతమ్మ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విదంగా పాతబస్టాండులోని కొలువుదీరిన అమ్మవారి విగ్రహానికి కోట్ల సుజాతమ్మ పూజలు నిర్వహించారు. 


ఆదోని టౌన్‌: నవరాత్రుల సందర్భంగా పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన అమ్మవారిని శనివారం నిమజ్జనానికి తరలించారు. ఎల్‌బీ వీధి, క్రాంతినగర్‌, కిల్చిన్‌పేట తదితర ప్రాంతాలలో కొలువుతీరిన అమ్మవారికి ఉదయమే ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పూజలలో పాల్గొని తమ మొక్కుబడులు తీర్చుకొన్నారు. సాయంత్రం పురవీధులలో ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేశారు. 


మంత్రాలయం: మంత్రాలయం పాత ఊరులో వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం వెండిరథోత్సం వైభవంగా జరిగింది.  పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు ఆధ్వర్యంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అదే విధంగా మండలంలోని పలు గ్రామాల్లో దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. శమీవృక్షం వరకు ఊరేగింపు నిర్వహించారు.  గ్రామాల్లో  సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 

Updated Date - 2021-10-17T06:10:36+05:30 IST