Abn logo
Jun 11 2021 @ 22:35PM

చేతి చమురు వదులుతోంది

కరోనా కాలంలోనూ ప్రజలపై బాదుడా

ఇదంతా మోదీ చేతికానితనమే

కాంగ్రెస్‌ నాయకుల ధ్వజం

పెరిగిన పెట్రో ధరలపై జిల్లా వ్యాప్తంగా నిరసన

నెట్‌వర్క్‌: పెరుగుతున్న ఇంధన ధరలతో చేతి చమురు వదులు తోందని కాంగ్రెస్‌ నాయకులు విమర్శించారు. డీజిల్‌, పెట్రోల్‌ ధరలకు నిరసనగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ హ యాంలో రూ. 70గా ఉన్న పెట్రోల్‌ నేడు రూ. వందకు చేర డం మోదీ చేతకానితనం అన్నారు. కరోనా కష్ట కాలంలో కూ డా ప్రజలను పన్నుల పేరుతో బాధడం మోదీ ప్రభుత్వానికే చెల్లిందని ఎద్దేవా చేశారు. వ్యాక్సిన్‌ విషయంలో ఒంటెత్తు పోకడలు పోయిన ప్రభుత్వం.. చమురు ధరల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

అశ్వారావుపేటలో మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకురాలు నాగమణి, పార్టీ మండల అధ్యక్షుడు మొగళ్లపు చెన్నకేశవులు, ఎంపీటీసీలు వేముల భారతి, సత్యవరపు తిరుమల, ఎస్‌కే పాషా, చిన్నంశెట్టి రామకృష్ణ, ముళ్లగిరి కృష్ణ, శివరామరాజు, బండారి మహేష్‌, వేముల ప్రతాఫ్‌, శివకాశి, దుర్గయ్య పాల్గొన్నారు. 

దుమ్ముగూడెంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు శీనివాసరావు, తెల్లం హరికృష్ణ, వెంకటరమణారెడ్డి, దర్శి సాంబశివరావు, సంగీతరావు, సందీప్‌రెడ్డి, అఖిల్‌, సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు. 

కరకగూడెంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్‌ ఇక్బాల్‌ హుస్సేన్‌, నాగబండి వెంకటేశ్వర్లు, షేక్‌ యాకూబ్‌, సాగర్‌, షేక్‌ రఫీ, హైమద్‌, ముజఫర్‌, రవీందర్‌ పాల్గొన్నారు.

మణుగూరులో నియోజకవర్గ కన్వీనర్‌ చందా సంతోష్‌ ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు గోపి, వరలక్ష్మి, నూరుద్దీన్‌, నవీన్‌, భీరం సుధాకర్‌ ఉన్నారు. పొలమూరి రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు బూర్గుల నర్సయ్య, యూత్‌ నాయకులు వీరన్న, రషీద్‌, కుర్రం రవి, ఆరీఫా పాషా, పగిడిపల్లి శ్యామ్‌, రంగా, జంపయ్య పాల్గొన్నారు. 

అశ్వాపురంలో చేపట్టిన నిరసనలో ఎంపీటీసీ విజయలక్ష్మీ, నాయకులు రామకృష్ణ, రాఘవులు, రాము, నరసింహారావు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. 

పినపాకలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో బోడ రమేష్‌, మండల ఉపాధ్యక్షుడు కొంబత్తిని శ్రీను,గీదసాయి, నవీన్‌, వెంకటేష్‌, సాంబయ్య, తాతయ్య, బట్ట వెంకటేశ్వర్లు, భద్రయ్య, కలం రమేష్‌, రాము పాల్గొన్నారు. 

భద్రాచలంలో కాంగ్రెస్‌ మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు సారెళ్ల నరేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బంధం శ్రీనివాస్‌గౌడ్‌, రేపాక పూర్ణచంద్రరావు, బలుసు సతీష్‌, సుబ్బారావు, యువజన కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షులు చింతిర్యాల సుదీర్‌, యువజన కాంగ్రెస్‌ జిల్లా ఎడారి ప్రదీప్‌, సరెళ్ల వెంకటేష్‌, ఉబ్బా వేణు పాల్గొన్నారు.

చర్లలో కాంగ్రెస్‌ డివిజన్‌ నాయకుడు నల్లపు దుర్గా ప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విజయభాస్కర్‌ రెడ్డి, తాటి జ్యోతి, రామకృష్ణ, కోదండరామయ్య, సతీష్‌ పాల్గొన్నారు.

ఆటోను తాళ్లతో లాగి

పెంచిన డీజిల్‌, పెట్రోల్‌ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ పిలుపు మేరకు శుక్రవారం టీపీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో పాల్వంచలో పెట్రోల్‌బంకు ఎదుట ధర్నా నిర్వహించారు. సుమారు గంట పాటు బీసీఎం రోడ్‌ వెంకటేశ్వర టాకీసు సమీపంలోని ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌బంక్‌ వద్ద బైఠాయించిన నా యకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఈసందర్భంగా ఆటోకు తాళ్ళు కట్టి లాగి నాయకులు నిరసన తెలిపారు. అనంతరం ఎడవల్లి కృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చాక రూ.70 ఉన్న పెట్రోల్‌ ధర సెంచరీ కొట్టిందని దుయ్యబట్టారు. ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎ జలీల్‌, నాయకులు పూనెం అనుదీప్‌, పెంకి శ్రీను, చాంద్‌పాషా, లోగాని మురళి, దస్తగిరి, కాపా శ్రీను, ఎ పాల్‌, ఎ రాజేష్‌కుమార్‌, రమేష్‌, కోళ్లపుడి ప్రవీణ్‌, రమేష్‌, శ్రీనివాస్‌, నామా ప్రసాద్‌, భాను, ఎస్‌ వెంకట్‌, రాములునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తక్షణమే తగ్గించాలని కోరుతూ శుక్రవారం జూలూరుపాడులో సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పెట్రోల్‌ బంక్‌ ఎదుట కాంగ్రెస్‌ పార్టీ ఆఽధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమాలలో సీపీఐ, కాంగ్రెస్‌ నాయకులు చింతా స్వరాజ్‌ రావు, మధు, జనార్దన్‌, సమీర్‌, దుబాయ్‌, నాగరాజు, వీరభద్రం, ఎంపిటీసీ సతీష్‌, వీరభద్రం, బొడ్డు కృష్ణయ్య, నున్నా కృష్ణయ్య, మందా బాబు పాల్గొన్నారు. 

ఇల్లెందులో కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చీమల వెంకటేశ్వర్లు ఆధ్వ ర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు దొడ్డా డాని యేల్‌, మాజీ కౌన్సిలర్‌ సుదర్శన్‌కోరి, ఐఎన్‌టీయుసీ నేతలు మహబూ బ్‌, గోచికొండ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జాఫర్‌, సర్పం చ్‌ దనసరి స్రవంతి, ఈశ్వర్‌గౌడ్‌, కల్తి వెంకటేశ్వర్లు, వల్లాల రాజయ్య, లక్ష్మీనారాయణ, కాయం రమేష్‌, హరికృష్ణ, రాజు పాల్గొన్నారు. 

సుజాతనగర్‌లో జిల్లా యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు వీరబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అజ్మత్‌ పాషా, కోటేష్‌, లక్ష్మణ్‌రావు, రాంలక్ష్మణ్‌, నరేష్‌, శ్రీకాంత్‌, సంపత్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement