‘కేసీఆర్‌కు సిద్దిపేట కలెక్టర్ పెద్ద కొడుకు పాత్ర పోషిస్తున్నారు’

ABN , First Publish Date - 2020-10-22T00:18:07+05:30 IST

దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిస్తే రాష్ట్ర ప్రజలకు శాపమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కేసీఆర్‌కు పెద్దకొడుకు పాత్ర పోషిస్తున్నారని ..

‘కేసీఆర్‌కు సిద్దిపేట కలెక్టర్ పెద్ద కొడుకు పాత్ర పోషిస్తున్నారు’

సిద్దిపేట: దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిస్తే రాష్ట్ర ప్రజలకు శాపమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కేసీఆర్‌కు పెద్దకొడుకు పాత్ర పోషిస్తున్నారని ఆయన విమర్శించారు. ఫలితాలు రాకముందే టీఆర్‌ఎస్‌ గెలిచినట్లు ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. కారు గెలిస్తే మళ్లీ కేసీఆర్‌ కాలర్ ఎగరవేస్తాడన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కాంగ్రెస్ ప్రజల్లోకి తెచ్చినా పట్టించుకోపోతే రాష్ట్రాన్ని ఎవ్వరూ కాపాడలేరని జగ్గారెడ్డి అన్నారు. 



Updated Date - 2020-10-22T00:18:07+05:30 IST