Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 21 2021 @ 18:00PM

అవి కాంగ్రెస్ కళ్లకు కనిపించవు: సీఎం చౌహాన్

భోపాల్: భారతీయ జనతా పార్టీ ఏలుబడిలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్ నేతల కళ్లకు కనిపించదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్‌నాథ్ చేసిన వ్యాఖ్యలపై శివరాజ్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పాలనలో ఎన్నో పనులు జరుగుతున్నాయని, వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలో ఉండగా అసలేమీ జరగలేదని అన్నారు.


ఖాండ్వాలో గురువారం ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో శివరాజ్ సింగ్ మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ పార్టీ నేతల కళ్లకు మా అభివృద్ధి పనులు కనిపించవు. విమర్శలు చేయాలి కాబట్టి ఏవేవో విమర్శలు చేస్తున్నారు. నేను నటుడినని, మోదీ డైరెక్టర్ అని కమల్‌నాథ్ అంటున్నారు. వాళ్లన్నట్లు ఈ నటుడే నిమర్ ప్రాంతానికి నీళ్లు తెచ్చాడు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పగలరా? వాళ్లు చెప్పలేదు. ఎందుకంటే వాళ్లు అధికారంలో ఉండగా ఏమీ జరగలేదు’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement