ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ ఆందోళన

ABN , First Publish Date - 2021-08-01T05:44:31+05:30 IST

కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధును అమలు చేయాలంటే ఎమ్మెల్యే పదవికి గంగుల కమలాకర్‌ వెంటనే రాజీనామా చేయాలని నగర కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని తెలంగాణ చౌక్‌లో ఆందోళన నిర్వహించారు.

ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ ఆందోళన
తెలంగాణ చౌక్‌లో ఫ్లకార్డులతో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ నాయకులు

గణేశ్‌నగర్‌, జూలై31: కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధును అమలు చేయాలంటే ఎమ్మెల్యే పదవికి గంగుల కమలాకర్‌ వెంటనే రాజీనామా చేయాలని నగర కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని తెలంగాణ చౌక్‌లో ఆందోళన నిర్వహించారు. అనంతరం ఇందిరాగాంధీ విగ్రహం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికలు జరుగుతున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే అభివృద్ధి నిధుల వరద పారుతోందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం గంగుల కమలాకర్‌ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి అంజన్‌కుమార్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర నేత గడ్డం విలాస్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి రవి, తదితరులు పాల్గొన్నారు. 

ఫచొప్పదండి: దళిత బంధు పథకం రావాలంటే ఎమ్యెల్యే సుంకె రవిశంకర్‌ రాజీనామా చేయాలని చొప్పదండిలోని అంబేద్కర్‌ విగ్రహానికి అంబేద్కర్‌ విగ్రహానికి  కాంగ్రెస్‌ నాయకులు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భక్తు విజయ్‌ కుమార్‌, కునమల్ల రాజశేఖర్‌, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోమటిరెడ్డి పద్మాకర్‌ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ముద్దం తిరుపతి గౌడ్‌, నాయకులు గుర్రం రమేష్‌ గౌడ్‌, కొట్టే అశోక్‌, పెరుమాండ్ల గంగయ్య, సంభోజి సునీల్‌, గోల సంపత్‌, కల్లేపల్లి ప్రేమ్‌ కుమార్‌, గుండేటి విజయ్‌, బుచిలింగం, బండారు అఖిల్‌, బండారు రాజేష్‌, కర్ణాకర్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-08-01T05:44:31+05:30 IST