Abn logo
Aug 14 2020 @ 13:13PM

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిపై దాడి కేసు: కాంగ్రెస్ కార్పొరేటర్ భర్తతో పాటు 80 మంది అరెస్ట్

బెంగళూరు : కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తి నివాసంపై జరిగిన దాడిలో శుక్రవారం కీలక మలుపు జరిగింది. ఈ కేసులో సంబంధం ఉందంటూ కాంగ్రెస్ కార్పొరేటర్ ఇర్షద్ బేగం భర్త కలీమ్ పాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయనతో పాటు మరో 80 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో కలీమ్ పాషాను ఏడో నిందితునిగా పోలీసులు పేర్కొన్నారు.


అంతేకాకుండా ఆ దాడికి కుట్ర పన్నిన వారిలో ఆయనా ఉన్నారని పోలీసులు ప్రకటించారు. వీరందర్నీ బళ్లారి జైలుకు పంపించారు. ఈ కేసులో మరో కీలక మలుపు కూడా సంభవించింది. తమ సోషల్ మీడియా అకౌంట్‌ను హ్యాక్ చేశారని ప్రకటించిన ఎమ్మెల్యే అల్లుడు... పోలీసుల ముందు అప్రువర్‌గా మారిపోయారు. ఇలా అభ్యంతరకరమైన పోస్టులు పెట్టింది కూడా తానేనని పోలీసుల ముందు అంగీకరించినట్లు సమాచారం. 

Advertisement
Advertisement
Advertisement