Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 25 2021 @ 14:49PM

టీఆర్ఎస్ లో చేరిన తొర్రూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కౌన్సిలర్

వరంగల్: మహబూబాబాద్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీ లో కాంగ్రెస్ కు చెందిన 8వ వార్డు కౌన్సిలర్ నర్కుటి గజానంద్ టిఆర్ఎస్ పార్టీలో చేరారు. హన్మకొండలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గురువారం గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గజానంద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సీఎం కెసిఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, రైతులకోసం చేస్తున్న పనులకు ఆకర్షితుడపై మంత్రి నేతృత్వంలో టిఆర్ఎస్ లో చేరుతున్నమన్నారు. గజానంద్ కి తగిన గుర్తింపు లభిస్తుందని మంత్రి అన్నారు.

Advertisement
Advertisement