రామగుండం బల్దియా ఎదుట కాంగ్రెస్‌ ఆందోళన

ABN , First Publish Date - 2020-12-04T05:30:00+05:30 IST

రామగుండం నగర కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

రామగుండం బల్దియా ఎదుట కాంగ్రెస్‌ ఆందోళన
కార్పొరేషన్‌ అధికారులకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

- పేదలందరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లివ్వాలి 

- ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌

కోల్‌సిటీ, డిసెంబరు 4: రామగుండం నగర కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మున్సిపల్‌ జంక్షన్‌ వద్ద రోడ్డుపై బైఠాయించా రు. గోదావరిఖని వన్‌టౌన్‌ సీఐ పర్స రమేష్‌ కాంగ్రెస్‌ నాయకులను, కార్యకర్తలను బలవంతంగా ఆందోళన విరమింపచేశారు. కార్పొరేష న్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని చెప్పి రోడ్డుపై బైఠాయించడం ఏమిటంటూ అ భ్యంతరం చెప్పారు. అనంతరం కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ ఆందోళ ననుద్దేశించి రామగుండం కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మక్కాన్‌సింగ్‌ మాట్లాడారు. రామగుండం ము న్సిపల్‌ కార్పొరేషన్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌లు స రైన సంఖ్యలో మంజూరు కాలేదన్నారు. రెండున్నర లక్షల జనాభా ఉన్న రామగుండంలో 45 వేల మందికిపైగా కుటుంబాలున్నాయన్నారు. రామగుండం నియోజకవర్గానికి 260డబుల్‌బెడ్‌రూమ్‌లు మంజూరుకాగా అందులో అర్బ న్‌కు 160 మాత్రమే కేటాయించారన్నారు. అవ సరానికి తగ్గట్టు డబుల్‌బెడ్‌రూమ్‌లు మంజూ రుచేయాలని, అర్హులైన పేదలకు కేటాయించాలన్నారు. ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ పేర ప్రజల ను దోపిడీ చేసేప్రయత్నాలు చేస్తోందని, వెంట నే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ధరణి పేర పూరిగుడిసె ఉన్న పేదలను సైతం ఇంటి యజమానులుగా గుర్తిస్తూ అన్యాయం చేస్తోం దన్నారు. మల్కాపూర్‌లో సుందిళ్ల బ్యారేజ్‌ బ్యా క్‌వాటర్‌తో ముంపు ఏర్పడుతుందని, మట్టి పో సి గ్రామాలకు నీరు రాకుండా చూడాలని డిమాండ్‌ చేశారు.అనంతరం మేనేజర్‌ వెంకటేశ్వ ర్లుకు వినతిపత్రం అందజేశారు. నగరకాంగ్రెస్‌ అధ్యక్షుడు బొంతల రాజేష్‌, కాల్వ లింగస్వామి, బొమ్మక రాజేష్‌, కార్పొరేటర్లు మహంకాళి స్వా మి, కొలిపాక సుజాత, నగునూరి సుమలత, పెద్దెల్లి తేజస్విని, గాదం విజయ, ముస్తాఫా, ముదాం శ్రీనివాస్‌, నాయకులు నగునూరి రా జు,గట్ల రమేష్‌, ఫజల్‌బేగ్‌, నజీమోద్దీన్‌, గాదం నందు, యుగంధర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:30:00+05:30 IST