Abn logo
Sep 13 2021 @ 18:51PM

కాంగ్రెస్‌‌‌కు కార్యకర్తల బలం చాలా ఉంది: శ్రీధర్ బాబు

 హైదరాబాద్:  కాంగ్రెస్‌‌‌కు కార్యకర్తల బలం చాలా ఉందని కాంగ్రెస్‌ నేత శ్రీధర్ బాబు అన్నారు. రాబోయే ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతల ఆధ్వర్యంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ సీఎంగా అన్ని రంగాలలో విఫలం అయ్యారని విమర్శించారు. ఎమ్మెల్యేలు, ఎంపీల మీటింగ్ జరుపుకున్నామని చెప్పారు. అక్కడ సీఎల్పీ నాయకులు సీఎం మీటింగ్‌లో మాట్లాడుతారని తెలిపారు. దళితుల విషయంలో అన్ని అంశాలలో పొరాటం చేస్తామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.