Abn logo
Nov 15 2020 @ 19:32PM

ఐసీయూలో చేరిన కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్

Kaakateeya

చండీగఢ్: అనారోగ్యం కారణంగా కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్‌ను గురుగ్రామ్‌లోని మెదంత ఆస్పత్రిలోని ఐసీయూలో చేర్పించినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు. అహ్మద్ పటేల్‌కు కొన్ని వారాల ముందు కరోనా పరీక్షలు చేయడంతో కోవిడ్-19 పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు.


ఈ నేపథ్యంలో ఆయన ఆస్పత్రిలో చేరారని, పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు చెప్పారు. అహ్మద్ పటేల్ వైద్యుల పరిశీలనలో ఉన్నారని చెప్పారు. తన తండ్రి త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నామని అహ్మద్ పటేల్ కుమారుడు ఫైసల్ పటేల్ ట్వీట్ చేశారు.

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement