బీజేపీ నేత కనిపించడం లేదంటూ పోస్టర్లు.. కాంగ్రెస్ నేత అరెస్ట్

ABN , First Publish Date - 2020-05-26T00:39:22+05:30 IST

మధ్యప్రదేశ్ బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా కనబడటం లేదంటూ గ్వాలియర్లో పోస్టర్లు దర్శనమిచ్చాయి.

బీజేపీ నేత కనిపించడం లేదంటూ పోస్టర్లు.. కాంగ్రెస్ నేత అరెస్ట్

గ్వాలియర్: మధ్యప్రదేశ్ బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా కనబడటం లేదంటూ గ్వాలియర్లో పోస్టర్లు దర్శనమిచ్చాయి. వీటిని కాంగ్రెస్ నేతలు అతికించినట్లు సమాచారం. సింధియా ఫొటోతోపాటు ‘ప్రజానేత కోసం వెదుకుతున్నాం’ అని ఆ పోస్టర్లపై రాసి ఉంది. సింధియా కనబడితే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సిద్ధార్థ్ సింగ్ రజావత్‌కు సమాచారం ఇవ్వాలని ఉంది. దీనిపై కేసు నమోదవడంతో రజావత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-05-26T00:39:22+05:30 IST