అధికారం రొటేషన్ పద్దతిలో ఉండాలి: చింతా మోహన్

ABN , First Publish Date - 2021-11-10T00:51:11+05:30 IST

రాష్ట్రంలో అధికారం రొటేషన్ పద్దతిలో ఉండాలని, రెండు సామాజిక వర్గాలకు

అధికారం రొటేషన్ పద్దతిలో ఉండాలి: చింతా మోహన్

పశ్చిమ గోదావరి: రాష్ట్రంలో అధికారం రొటేషన్ పద్దతిలో ఉండాలని, రెండు సామాజిక వర్గాలకు పరిమితం కాకూడదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ పాలనలో దేశంలో నిత్యావసర వస్తువులు రెట్లు మండిపోతున్నాయని ఆయన ఆరోపించారు. కారుచౌకగా హెరాయిన్ వంటి మత్తు పదార్ధాలు దొరుకుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. మోడీ విధానాలతో మరో సంవత్సరంలో పెట్రోల్ ధర 200 అవ్వడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం దేశంలో ప్రజలు ఎవరూ ఇష్టపడటం లేదన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం అమ్ముతుంటే రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. 2024లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని చింతామోహన్ ధీమా వ్యక్తం చేసారు. 

Updated Date - 2021-11-10T00:51:11+05:30 IST