Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపేది కాంగ్రెస్ మాత్రమే: Chinta mohan

విజయనగరం: దేశాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీనే అని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఇద్దరూ విశాఖ ఉక్కు కోసం ప్రధానిని అడగలేదని తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపగలిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే  అని స్పష్టం చేశారు. పోర్టులు, రైల్వేస్టేషన్స్ కూడా ప్రధాని మోదీ అమ్ముకుంటూ పోతున్నారని విమర్శించారు. పారిశ్రామిక వేత్తల సలహాలతో దేశాన్ని పాలిస్తున్నారని మండిపడ్డారు. జగన్ పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు. కాపు సామాజికవర్గ నాయకుడే 2024లో ముఖ్యమంత్రి కావాలని చింతా మోహన్ పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement