శాశ్వత గృహ నిర్మాణం పేరుతో వైసీపీ ప్రభుత్వం దోపిడీకి తెర: Mastan

ABN , First Publish Date - 2021-12-08T16:53:20+05:30 IST

శాశ్వత గృహ నిర్మాణం పేరుతో వైసీపీ ప్రభుత్వం దోపిడీకి తెర తీసిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి విమర్శలు గుప్పించారు.

శాశ్వత గృహ నిర్మాణం పేరుతో వైసీపీ ప్రభుత్వం దోపిడీకి తెర: Mastan

గుంటూరు: శాశ్వత గృహ నిర్మాణం పేరుతో వైసీపీ ప్రభుత్వం దోపిడీకి తెర తీసిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ 40 ఏళ్లలో ఎక్కడ లేని విధంగా వన్ టైమ్ సెటిల్మెంట్ పేరుతో మోసగిస్తున్నారన్నారు. ఒక్క ఇల్లు కూడా కట్టని ముఖ్యమంత్రికి ఓటీఎస్ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చిన జగన్ నేడు ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు. లోన్ ద్వారా తీసుకుని నిర్మించుకున్న ఇళ్ళను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి ఎందుకు మాట తప్పారని నిలదీశారు. జగన్ చేతకాని తనం వలన ప్రజలపైన నిప్పుల గుంపటి పెట్టారన్నారు. ప్రజలపై ఒత్తిడి తీసుకురావాలని అనుకుంటే చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు. సీఎం జగన్‌కు ప్రజలపైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఓటీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, ఒత్తిడికి గురౌతున్న ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలని మస్తాన్ వలి డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-08T16:53:20+05:30 IST