Advertisement
Advertisement
Abn logo
Advertisement

బండి, గంగుల ఇండ్లను ముట్టడిస్తాం: పొన్నం ప్రభాకర్

సిద్దిపేట: డిసెంబర్ 15 లోగా ధాన్యాన్ని కొనుగోలు చేయలేకపోతే పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇండ్లను ముట్టడిస్తామని కాంగ్రెస్ నాయకుడు  పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. జిల్లాలోని హుస్నాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించి ఆయన మాట్లాడారు. డిసెంబర్ 15లోగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న మొత్తం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ వరి ధాన్యం కొనుగోలు పూర్తి చేయకుంటే జిల్లా కేంద్రంలో రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరి దీక్ష చేపడతామని ఆయన ప్రకటించారు. ఎమ్మెల్సీ ఓట్ల క్యాంపు బిజీలో మంత్రి గంగుల ఉన్నారన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు కుటుంబ సమేతంగా ఏ విధంగా క్యాంపునకు వెళ్లారో అదేవిధంగా తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులోని క్యాంప్‌నకు మంత్రి వెళ్లాలసి ఉంటుందన్నారు. Advertisement
Advertisement