బీజేపీలో అసంతృప్తి కుమ్ములాటలు: పొన్నం

ABN , First Publish Date - 2022-01-13T22:34:36+05:30 IST

రాష్ట్రంలోని బీజేపీలో అసంతృప్తి కుమ్ములాటలు మొదలయ్యాయని మాజీ

బీజేపీలో అసంతృప్తి కుమ్ములాటలు: పొన్నం

సిద్దిపేట: రాష్ట్రంలోని బీజేపీలో అసంతృప్తి కుమ్ములాటలు మొదలయ్యాయని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం  ప్రభాకర్ అన్నారు. జిల్లాలోని హుస్నాబాద్‌లో పొన్నం ప్రెస్ మీట్‌ నిర్వహించి మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కరీంనగర్ బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన అసమ్మతి సమావేశంపై సంజయ్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈటెల రాజేందర్ బీజేపీలోకి రావడం సంజయ్‌కి ఇష్టం లేదన్నారు. సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామని చెప్తున్నారని, మరి ఏ ప్రాతిపదికన జైలుకు పంపిస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 


Updated Date - 2022-01-13T22:34:36+05:30 IST