బాలికలపై కాంగ్రెస్ నేత వివాదస్ప వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-01-14T21:45:50+05:30 IST

ర్మ చేసిన వ్యాఖ్యలపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా స్పందించి వెంటనే ఆయనకు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పంపింది. అయితే వర్మ చేసిన

బాలికలపై కాంగ్రెస్ నేత వివాదస్ప వ్యాఖ్యలు

భోపాల్: బాలికలు 15 ఏళ్లకే పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉంటారని కాంగ్రెస్ పార్టీ నేత సజ్జన్ సింగ్ వర్మ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) నోటీసులు పంపింది. మైనర్ బాలికలపై ఆ వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేశారని, ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న అంతర్యాన్ని వివరించాలని వర్మకు జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు.


‘‘ఆడామగ మధ్య పెళ్లి విషయంలో వయోబేధాలు ఉన్నాయి. మహిళలకు 18 ఏళ్లకే పెళ్లి వయసు ఎందుకు ఉండాలి. మగవారికి 21 ఏళ్ల వయసు ఉన్నట్లే ఆడవారి విషయంలో కూడా వయసును 21కి సవరించాలి’’ అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను వర్మ ఊటంకిస్తూ ‘‘డాక్టర్లు చెప్పిన ప్రకారమే, బాలకలు 15 ఏళ్ల వయసుకే పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉంటారు. ముఖ్యమంత్రి (శివరాజ్‌సింగ్) ఏమైనా డాక్టరా? ఆయన ఏ ప్రాతిపదికపైన పెళ్లికి మహిళల వయసు పెంచాలని అనుకుంటున్నారు?’’ అని అన్నారు.


వర్మ చేసిన వ్యాఖ్యలపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా స్పందించి వెంటనే ఆయనకు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పంపింది. అయితే వర్మ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత భూపెంద్ర గుప్త వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ‘‘పెళ్లి విషయంలో మహిళల వయసును పెంచాలని ముఖ్యమంత్రి ఏ ప్రాతిపదికన అన్నారోనని, దానికి శాస్త్రీయపరమైన ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలోనే వర్మ ఆ వ్యాఖ్యలు చేశారు’’ అని గుప్త అన్నారు.

Updated Date - 2021-01-14T21:45:50+05:30 IST