హేమామాలిని, స్మృతి ఇరానీపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-10-21T23:00:25+05:30 IST

అరుణ్ యాదవ్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి మహిళలంటే గౌరవం ఉంటుందని, ఈ విషయం పదే పదే రుజువు అవుతూనే ఉంటుందని అంటున్నారు. అరుణ్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీని డిమాండ్ చేస్తున్నారు..

హేమామాలిని, స్మృతి ఇరానీపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

భోపాల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అరుణ్ యాదవ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ ఎంపీలైన హేమామాలిని, స్మృతి ఇరానీలతో ద్రవ్యోల్బణాన్ని పోల్చుతూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పాలనలో ద్రవ్యోల్బణం గురించి ఆయన స్పందిస్తూ ‘‘మోదీ పాలనలో దేశం ఎంత వెనుకబడినా బీజేపీ వాళ్ల కంటికి బాగానే కనిపిస్తుంది. నిజానికి కాంగ్రెస్ పాలనలో కంటే బీజేపీ పాలనలో ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగింది. కానీ వాళ్ల కంటికి కాంగ్రెస్ పాలనలోని ద్రవ్యోల్బణం వేశ్యలా కనిపిస్తుంది. అదే ఇప్పుడు ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పటికీ అప్సరలా కనిపిస్తోంది. సరిగ్గా చెప్పాలంటే హేమామాలిని, స్మృతి ఇరానీల్లా’’ అని అన్నారు.


కాగా, అరుణ్ యాదవ్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి మహిళలంటే గౌరవం ఉంటుందని, ఈ విషయం పదే పదే రుజువు అవుతూనే ఉంటుందని అంటున్నారు. అరుణ్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీని డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2021-10-21T23:00:25+05:30 IST