Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒంటరిగానే కాంగ్రెస్ పోటీ: షబ్బీర్ అలీ

కామారెడ్డి: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు. పట్టణంలోని  క్లాసిక్ ఫంక్షన్ హాల్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇద్దరూ దొంగలేనని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం మెడలు వంచైనా ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతుల వెంటే ఉంటుందన్నారు. అధికారంలో లేకున్నా కాంగ్రెస్ ప్రజల మధ్యలోనే ఉన్నామన్నారు.


ఢిల్లీలో తెలంగాణ ఎంపీలతో ధర్నా చేయిస్తానని ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్ ఎంపీలను తిరిగి ఎందుకు హైదరాబాద్ రప్పించాడని ఆయన ప్రశ్నించాడు. ఢిల్లీకి దండయాత్రకు పోతున్నాం అని చెప్పి కేసీఆర్ సైతం వెనక్కి ఎందుకు తిరిగాడన్నారు. కేసీఆర్ మాట విని తెలంగాణ రైతులు వరి వేస్తే ప్రస్తుతం కొనుగోలు చేయబోనని మాట మారుస్తున్నాడని ఆరోపించారు. వరిని కొనుగోలు చేస్తామని గతంలోనే కేసీఆర్ అసెంబ్లీలో చెప్పాడన్నారు. దీనికి సీఎం కేసీఆర్ జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. Advertisement
Advertisement