ఎమ్మెల్యే పదవికి వనమా రాజీనామా చేయాలి: వీహెచ్

ABN , First Publish Date - 2022-01-10T20:55:02+05:30 IST

రామకృష్ణ ఆత్మహత్యతో తన కొడుకు రాఘవకు సంబంధమున్న

ఎమ్మెల్యే పదవికి వనమా రాజీనామా చేయాలి: వీహెచ్

భద్రాద్రి కొత్తగూడెం: రామకృష్ణ ఆత్మహత్యతో తన కొడుకు రాఘవకు సంబంధమున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈటెలను భూ కబ్జా కేసులో రాజీనామా చేయించిన సీఎం కేసీఆర్.. వనమాతో రాజీనామా ఎందుకు చేయించరని ఆయన ప్రశ్నించారు. రామకృష్ణ కుటుంబం సూసైడ్ ఘటనపై రాష్ట ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు తీసుకొవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2022-01-10T20:55:02+05:30 IST