Abn logo
Oct 18 2020 @ 21:15PM

కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌ పరిశీలనకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేతల అరెస్ట్

Kaakateeya

నాగర్‌కర్నూలు: కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌ పరిశీలనకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వెల్దండ దగ్గర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసినవారిలో భట్టి, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి ఉన్నారు. పోలీసులతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వాగ్వాదానికి దిగారు.


కల్వకుర్తి లిఫ్ట్‌ పంప్ హౌస్ మునగడానికి ప్రభుత్వానిదే బాధ్యత అని వంశీచంద్ రెడ్డి అన్నారు. పాలమూరు మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల లాభం కోసమే పాలమూరు- రంగారెడ్డి పంప్‌హౌస్ రీడిజైన్ చేశారని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని వంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement
Advertisement