chennai: అన్నదాతల ఉసురు తీయొద్దు

ABN , First Publish Date - 2021-10-12T15:34:50+05:30 IST

రైతుల ప్రాణాలను హరించవద్దని, హక్కుల కోసం న్యాయపరంగా ఉద్యమిస్తున్న అన్నదాతలపై దౌర్జన్యం ప్రదర్శించరాదని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ(టీఎన్‌సీసీ) డిమాండ్‌ చేసింది. ఉత్తరప్రదేశ్‌లో రైతు

chennai: అన్నదాతల ఉసురు తీయొద్దు

- కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ధ్వజం

- మౌనపోరాటంలో నేతలు


ప్యారీస్‌(చెన్నై): రైతుల ప్రాణాలను హరించవద్దని, హక్కుల కోసం న్యాయపరంగా ఉద్యమిస్తున్న అన్నదాతలపై దౌర్జన్యం ప్రదర్శించరాదని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ(టీఎన్‌సీసీ) డిమాండ్‌ చేసింది. ఉత్తరప్రదేశ్‌లో రైతులను దారుణంగా హతమార్చిన సంఘటనకు సంబంధించి కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఆఘటనపై ప్రత్యేక దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీఎన్‌సీసీ పిలుపు మేరకు సోమవారం కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల మాజీ ప్రతినిధులు మౌనపోరాటం చేపట్టారు. పశ్చిమ చెన్నై కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివ రాజశేఖరన్‌ నేతృత్వంలో అన్నాసాలైలో జరిగిన మౌనపోరాటంలో సీఎల్పీ లీడర్‌ సెల్వపెరుందగై పాల్గొన్నారు. అదే విధంగా, ఉత్తర చెన్నై జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎంఎస్‌ ద్రవ్యం అధ్యక్షతన వాషర్‌మెన్‌పేట పోస్టాఫీసు ముందు, విమానాశ్రయం సమీపంలో టీఎన్‌సీసీ ప్రధాన కార్యదర్శులు ఎస్‌ఏ వాసు, జ్యోతిరామలింగం, టీవీ దురైరాజ్‌ తదితరులు మౌనపోరాటంలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-10-12T15:34:50+05:30 IST