Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోశయ్యకు కాంగ్రెస్‌ నాయకుల నివాళి

తాండూరు/కులకచర్ల/పరిగి : మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రోశయ్యకు కాంగ్రెస్‌ నాయకులు నివాళులర్పించారు. ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో తాండూరులో రోశయ్య చిత్రపటాన్ని ఏర్పాటుచేసి పూలమాలలు మాలలువేసి నివాళులర్పించారు. కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌గౌడ్‌, ఏ-బ్లాక్‌ అధ్యక్షుడు సత్యమూర్తి, మాజీ కౌన్సిలర్లు సర్దార్‌ఖాన్‌, లింగదళి రవికుమార్‌, సీనియర్‌ నాయకులు కోర్వార్‌ నగే్‌షకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. కులకచర్లలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆ పార్టీ మండలాధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు భరత్‌, అంజిలయ్యగౌడ్‌, విఠల్‌నాయక్‌, రాంరెడ్డి, వెంకటయ్యలున్నారు. కాగా, పరిగి మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి రోశయ్య అంత్యక్రియల్లో పాల్గొని ఆయన పార్థివ దేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.

Advertisement
Advertisement