ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై దాడులు అమానుషం

ABN , First Publish Date - 2021-10-26T06:49:21+05:30 IST

రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి పాలనలో ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేయటం అత్యంత హేయమైన చర్యని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి విమర్శించారు. సోమవారం ఇందిరాభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై దాడులు అమానుషం
మైనార్టీ నాయకులకు నియామకపు ఉత్తర్వులు అందచేస్తున్న దేవకుమార్‌రెడ్డి

కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరు 

నెల్లూరు (వైద్యం), అక్టోబరు 25 : రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి పాలనలో ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేయటం అత్యంత హేయమైన చర్యని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి విమర్శించారు. సోమవారం ఇందిరాభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షాలకు గౌరవం ఇచ్చిందన్నారు. కానీ నేడు అధికార, ప్రతిపక్ష పార్టీలు  రాష్ట్ర అభివృద్ధిని మరచిపోయి బూతులతో వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ, భౌతిక దాడులకు దిగటం బాధాకరమన్నారు. ధరల నియంత్రణకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల బరిలో దిగుతుందని, అందరూ పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి లేళ్లపల్లి సురేష్‌బాబు, డీసీసీ ఉపాధ్యక్షుడు తలారి బాలసుధాకర్‌, రూరల్‌ అధ్యక్షుడు ఉడతా వెంకట్రావు, నగర ఇన్‌చార్జి ఫయాజ్‌, కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు ఏటూరి శ్రీనివాసులు, జిల్లా సేవాదళ్‌ అధ్యక్షులు కొండా అనిల్‌కుమార్‌, యూత్‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు పప్పర్తి గణేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 


మైనార్టీ, సోషల్‌ మీడియా విభాగాలకు ఎన్నిక

కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ, సోషల్‌ మీడియా విభాగాలకు నాయకులను ఎంపిక చేశారు. పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం ఉపాధ్యక్షుడిగా జిల్లాకు షేక్‌ ఖాజామస్తాన్‌ ఎంపికయ్యారు. ఆయనకు నియమకపు ఉత్తర్వులను డీసీసీ అధ్యక్షుడు దేవకుమార్‌రెడ్డి అందచేశారు. మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా షేక్‌ అల్లావుద్దీన్‌, ఉపాధ్యక్షుడిగా రహమాన్‌ను నియమించారు. మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడిగా షేక్‌ మాబాషా నియమితులయ్యారు. పార్టీ సోషల్‌ మీడియా విభాగం జిల్లా అధ్య క్షుడిగా షేక్‌ హుస్సేన్‌బాషా, సిటీ అధ్యక్షుడిగా సుధీర్‌బాబుకు నియామకపు పత్రాలను అందచేశారు. 

Updated Date - 2021-10-26T06:49:21+05:30 IST