Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రశాంత్‌ అతిగా ఊహించుకుంటున్నారు: జగ్గారెడ్డి

హైదరాబాద్: ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీపై తీవ్ర విమర్శలు చేసిన ప్రశాంత్‌ కిషోర్‌పై ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. రాహుల్‌పై ప్రశాంత్‌కిషోర్ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రశాంత్‌ తనకు తాను అతిగా ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ లేకుండా బీజేపీని ఓడించడం మిగితా పార్టీలకు కలగానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మమత, కేసీఆర్‌కు వంద పార్లమెంట్ స్థానాలు వచ్చే అవకాశం ఉందా  అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్యే పోటీ అని బీజేపీది థర్డ్ ప్లేస్‌లో ఉంటుందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్ క్యాంప్‌లకు తరలిస్తుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. కొప్పుల మంత్రిగా ఉండి ఓ కులాన్ని కించపరిచారన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ ఏం చర్యలు తీసుకుందన్నారు. Advertisement
Advertisement