ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు: శ్రీధర్ బాబు

ABN , First Publish Date - 2021-11-26T00:41:30+05:30 IST

ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఏం సాధించారని కాంగ్రెస్

ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు: శ్రీధర్ బాబు

హైదరాబాద్: ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఏం సాధించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రశ్నించారు.  ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అయోమయానికి గురి చేస్తున్నాయన్నారు. రైతులకు మద్దతు ధర రావాలని ఐకేపీ సెంటర్లను మొదట ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన పేర్కొన్నారు.


గన్నీ బ్యాగులు ఎన్ని అవసరమో అన్న లెక్క కూడా ప్రభుత్వం దగ్గర లేదన్నారు. ధాన్యం తరలించే ట్రాన్స్‌పోర్ట్ టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదన్నారు. నిల్వ సామర్థ్యం సరిపోయేంత లేదన్నారు. షరతులు లేకుండా పండిన ప్రతీ ధాన్యం గింజ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఏ పంట పండించినా కొనుగోలు చేయాల్సిన భాధ్యత కేంద్రంపై ఉందన్నారు. తాము చెప్పిన పంటనే వేయాలని ప్రభుత్వాలు రైతులను బెదిరిస్తున్నాయన్నారు. 




Updated Date - 2021-11-26T00:41:30+05:30 IST