Abn logo
Sep 24 2021 @ 01:32AM

ప్రజాస్వామ్యాన్ని పాతర పెట్టిన కేటీఆర్‌

సిరిసిల్లలో క్షీరాభిషేకం చేస్తున్న కాంగ్రెస్‌ జిల్లా నాయకులు

- జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ

- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం

సిరిసిల్ల టౌన్‌, సెప్టెంబర్‌ 23: డ్రగ్‌ పరీక్షలపై సవాలును స్వీకరించకుండా టీఆర్‌ఎస్‌ రౌడీలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటిపైకి ఉసి గొల్పి మంత్రి కేటీఆర్‌ ప్రజాస్వామ్యంను పాతర పెట్టారని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నాగుల సత్యనారయణ అన్నారు. గురువారం సిరిసిల్ల పట్టణం గాంధీచౌక్‌ వద్ద జిల్లా కాంగ్రెస్‌, పట్టణ కాంగ్రెస్‌ సంయుక్త ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభీషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ఇంటిపై టీఆర్‌ఎస్‌ గూండాలు దాడి చేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. డ్రగ్‌ మాఫీయాతో ఎలాంటి సంబంధాలు లేవని ఎలాంటి పరీక్షలకైన సిద్దమని మంత్రి కేటీఆర్‌ ముందుకొచ్చారని గుర్తచేశారు. టీపీసీసీ అధ్యక్షుడు వైట్‌ చాలెంజ్‌ చేస్తూ గన్‌పార్క్‌ వద్దకు రావాలని తాము కూడా పరీక్షలకు సిద్దమని సవాలు విసిరి గన్‌పార్క్‌కు చేరుకొని మంత్రి కేటీఆర్‌ రాకపోవడంతో ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన వ్యక్తం చేయడం జరిగిందన్నారు. డ్రగ్స్‌పై వస్తున్న ఆరోపణలను ఎదుర్నొన లేక విషయాన్ని పక్కదోవ పట్టించడానికి యత్నించారని ఆరోపించారు. రాజకీయంగా రేవంత్‌రెడ్డిని ఎదుర్నొన లేక ఇంటిపైకి గూండాలతో దాడి చేయించి, అడ్డుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం నిరంకుశపాలనకు నిదర్శనం అన్నారు. దాడులు చేసిన టీఆర్‌ఎస్‌ రౌడీలపైన కేసులు పెట్టక పోవడం అన్యాయం అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలనను ప్రజలు గమనిస్తున్నారని రానున్న రోజులో ప్రజలే బుద్ధిచెపుతారని అన్నారు. ఇలాంటి దాడులు పునారావృతం అయితే కాంగ్రెస్‌ పార్టీ పక్షాణ ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి పైసా అంజనేయులు, కార్యదర్శి కాసర్ల రాజు, పట్టణ మహిళ విభాగం అధ్యక్షురాలు కాముని వనిత, కార్యదర్శి సానియా, నాయకుల తాటికొండ శ్రీనివాస్‌, కోడూరు దత్తు, చిందమ్‌ శ్రీనివాస్‌, రెడ్డిమల్ల భాను, వంగ మల్లేశం, బాలకిష్టయ్య, కాసర్ల రాములు, మధు, తడక వెంకటేశం, సంగం శ్రీనివా్‌సలు పాల్గొన్నారు.