శాసనసభలో పచ్చి బూతులా?: సాకే శైలజానాథ్

ABN , First Publish Date - 2021-11-20T22:35:51+05:30 IST

ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన నిండు శాసన సభలో పచ్చి బూతులా? అని పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ అన్నారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనను ఆయన...

శాసనసభలో పచ్చి బూతులా?: సాకే శైలజానాథ్

అమరావతి: ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన నిండు శాసన సభలో పచ్చి బూతులా? అని పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ అన్నారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనను ఆయన ఖండించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ నేతలు వ్యాఖ్యలు తగవన్నారు. వాక్‌ స్వాతంత్ర్య హక్కును ఉపయోగించుకుని నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని సూచించారు. ఓ గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి, అదీ వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది బాధాకరమన్నారు. 


‘‘రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలి కానీ కుటుంబ సభ్యులను అందులోకి లాగి అసభ్యంగా మాట్లాడటం క్షమార్హం కాదు. శిశుపాలుడి వంద తప్పులు పూర్తయ్యాయి. ఇక అరాచకాన్ని ఉపేక్షించేది లేదు. ప్రజలు దుశ్యాసనుల భరతం పడతారు. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.’’ అని  శైలజానాథ్ అన్నారు. 


Updated Date - 2021-11-20T22:35:51+05:30 IST