Abn logo
Sep 23 2021 @ 01:19AM

కోరుట్లలో కాంగ్రెస్‌ నిరసనలు

సీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

కోరుట్ల, సెప్టెంబరు 22 : పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఇంటిపై టీఆర్‌ఎస్‌ కార్యాకర్తల దాడిని నిరసిస్తూ బుధవారం పట్టణంలో కాంగ్రెస్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో జాతీ య రహదారిపై ఆందోళన చేసి సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడారు. రేవంత్‌ రెడ్డి ఇంటిపై దాడి చేసిన టీఆర్‌ఎస్‌ నాయకులను గుర్తించి కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకలు తిరుమల గంగాధర్‌, నయిం, సోగ్రభీ, అక్బర్‌, మేకల నర్సయ్య, ఎంబేరి స్యత్యనారాయణ, తుపాకుల బాజన్న, దండవేణి వెంకటేష్‌, షకీల్‌, అన్వర్‌, వాసం అజయ్‌, కోట గంగాధర్‌, గడెల అశోక్‌, తోడెటి శ్రావణ్‌, సందీప్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు. 

మెట్‌పల్లి : పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటిపై దాడిని నిరసిస్తూ బుధవారం పట్టణ కాంగ్రెస్‌ నాయ కులు కొత్త బస్టాండ్‌ వద్ద జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీ ఆర్‌ల దిష్టి బొమ్మలను దహనం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ ఖుతుబొద్దీన్‌ పాషా  నాయకు లు జెట్టి లింగం, రాంప్రసాద్‌, లక్ష్మణ్‌, సంతోష్‌రెడ్డి, చైతన్య, ముఖీం తదితరులు ఉన్నారు.