విద్యుత్‌ బిల్లులు మాఫీ చేయాలని కాంగ్రెస్‌ నిరసన

ABN , First Publish Date - 2020-07-07T10:37:23+05:30 IST

పేదలు, మధ్యతరగతి ప్రజల కరెంటు బిల్లులను ప్రభుత్వం మాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం విద్యుత్‌శాఖ

విద్యుత్‌ బిల్లులు మాఫీ చేయాలని కాంగ్రెస్‌ నిరసన

మంచిర్యాల టౌన్‌, జూలై 6: పేదలు, మధ్యతరగతి ప్రజల కరెంటు బిల్లులను ప్రభుత్వం మాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం విద్యుత్‌శాఖ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలతో ధర్నా నిర్వహించారు. మూడు నెలల లాక్‌డౌన్‌ కాలానికి సంబంధించిన బిల్లులను ప్రభుత్వమే భరించాలని డి మాండ్‌ చేశారు. దారిద్య్రరేఖకు దిగువ ఉన్న పేద ప్రజ లు, చిరు వ్యాపారుల విద్యుత్‌ బిల్లులను మాఫీ చేయ డంతోపాటు, మిగతా వారికి బిల్లుల భారం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. సూపరింటెండెంట్‌ వినతిపత్రం అంద జేశారు. పట్టణాధ్యక్షుడు  నరేష్‌, పెంట రజిత,  అబ్దుల్‌ మాజిద్‌, జోగుల సదానందం, ప్రభాకర్‌  పాల్గొన్నారు. 


బెల్లంపల్లిటౌన్‌: లాక్‌డౌన్‌ సమయంలోని విద్యుత్‌ బిల్లులు మాఫీ చేయాలని విద్యుత్‌ శాఖ డివిజనల్‌ ఇంజ నీర్‌ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, సూరి బాబు, శంకర్‌, ప్రభాకర్‌యాదవ్‌ పాల్గొన్నారు. 


తాండూర్‌(బెల్లంపల్లి):  లాక్‌డౌన్‌లో జారీ చేసిన క రెంటు బిల్లులను మాఫీ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నాయ కులు నిరసన చేపట్టారు. మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఈసా, శ్రీనివాస్‌, రవీందర్‌రెడ్డి, పోశం పాల్గొన్నారు. 


మందమర్రిటౌన్‌: విద్యుత్‌ కార్యాలయం వద్ద కాం గ్రె స్‌ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. నోముల ఉపేందర్‌ గౌడ్‌, సొత్కు సుదర్శన్‌, కడారి జీవన్‌కుమా ర్‌, ఎండీ ముజాయిద్‌, రాజ్‌కుమార్‌, పాల్గొన్నారు. 


జన్నారం: విద్యుత్‌ బిల్లులు మాఫీ చేయాలని కాం గ్రెస్‌ ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నాచేశారు. అనం తరం సబ్‌ఇంజనీర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభు దాస్‌,రాజన్న, మోహన్‌రెడ్డి, ఫసివుల్లా పాల్గొన్నారు. 


నస్పూర్‌: అధిక విద్యుత్‌ బిల్లులను నిరసిస్తూ కాం గ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్‌ ఎదుట నాయ కులు ధర్నా నిర్వహించి వినతిపత్రం అందించారు. పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్‌, పూదరి తిరుపతి, వేణు, సుమతి మల్లేష్‌, సంధ్యారాణి రాంమూర్తి, పాల్గొన్నారు. 


లక్షెట్టిపేట: విద్యుత్‌ బిల్లులు మాఫీ కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌లీడర్‌ చల్లా నాగభూషణం ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, నాయకులు ధర్నా నిర్వహించారు. సబ్‌ ఇంజనీర్‌కు విన తిపత్రం అందజేశారు.  చింత సువర్ణ అశోక్‌, వెంకటేష్‌,అశోక్‌కుమార్‌,ఆరిఫ్‌,విజయ్‌కుమార్‌,  పాల్గొన్నారు.  


కాసిపేట: విద్యుత్‌ బిల్లులను రద్దు చేయాలని కోరు తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్‌ సబ్‌ ఇంజనీ ర్‌కు వినతిపత్రం అందజేశారు. రత్నం ప్రదీప్‌, గోనే శ్రీకాంత్‌, రాజ్‌కుమార్‌, శివ, తరుణ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-07T10:37:23+05:30 IST