కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి చర్యలు

ABN , First Publish Date - 2021-08-02T05:06:26+05:30 IST

రాష్ట్రంలో కాంగ్రె స్‌ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర మాజీ మంత్రి జేడీ.శీలం పే ర్కొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న జేడీ.శీలం






కేంద్ర మాజీ మంత్రి జేడీ.శీలం


ఒంగోలు(క్రైం), ఆగస్టు 1 : రాష్ట్రంలో కాంగ్రె స్‌ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర మాజీ మంత్రి జేడీ.శీలం పే ర్కొన్నారు. ఆదివారం ఒంగోలులోని కాంగ్రెస్‌ పా ర్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం అనం తరం మీడియాతో మాట్లాడారు. బడుగు బల హీన వర్గాల ప్రజల అభిమానం చూరగొనే వి ధంగా క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్‌ను బలోపే తం చేయనున్నట్లు ఆయన చెప్పారు. కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలను ప్రజలను ఈసడించుకుంటు న్నారని, సమస్యల పరిష్కారంలో అవి వైఫల్యం చెందాయని విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం అధిక భారం మోపిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభు త్వం మెతక వైఖరి అవలంభిస్తు ప్రజల సమస్య లు గాలికి వదిలేసిందని చెప్పారు. రైతులకు గి ట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా కేంద్రం వైఫల్యం చెందిందని, అదేవిధంగా విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటకరణలో రెండు ప్రభు త్వాలు భాగస్వాములేనని ఆరోపించారు. వారం లో మండల స్థాయిలో అన్నీ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ చైర్మన్‌ కొరివి వినయ్‌కుమార్‌, ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షు రాలు పి.శాంతకుమారి, బీసీసెల్‌ అధ్యక్షులు న లకుర్తి వెంకటేశ్వర్లు, మైనారిటీ విభాగం రాష్ట్ర అ ధ్యక్షులు దాదాగాంధీ, రాష్ట్ర ఉపాధ్యాక్షులు శ్రీప తి ప్రకాశం, నగర అధ్యక్షురాలు డి.నాగలక్ష్మి, నా యకులు మన్నం ప్రసన్నరాజు, దాసరి రవి, జి ల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జులు త దితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-02T05:06:26+05:30 IST