మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్

ABN , First Publish Date - 2020-10-21T17:51:20+05:30 IST

ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ బుధవారం మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌తో పాటు రైతుల బకాయిలను

మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్

పాట్నా : ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ బుధవారం మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌తో పాటు రైతుల బకాయిలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రస్తుత మున్న కరెంట్ బిల్లులను కూడా మాఫీ చేస్తామని, పంటకు సరైన ధర వచ్చేలా చూస్తామని కాంగ్రెస్ నేత శక్తి సింగ్ గోహిల్ ప్రకటించారు. పంజాబ్ తరహాలోనే తాము కూడా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తామని ఆయన ప్రకటించారు. రైతులు గనక ట్రాక్టర్లను కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ ఉచితంగా చేస్తామని కాంగ్రెస్ పేర్కొంది. వీటితో పాటు నిరుద్యోగులకు ఉద్యోగం దొరికే వరకూ నెలకు 1500 రూపాయలను ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది.


అధికారంలోకి రాగానే 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని, మొదటి కేబినెట్ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ సీనియర్ రాజ్‌బబ్బర్ ప్రకటించారు. నితీశ్ ప్రభుత్వం యువతను తీవ్రంగా మోసిగించిందని, దీనిపై స్పందించేందుకు యువత రెడీగా ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఉపాధి విషయంపై సర్వే చేయడంతో పాటు శిబిరాలను కూడా ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. వితంతువులకు 1000 రూపాయల పెన్షన్, బాలికలకు పీజీ నుంచి కేజీ వరకూ ఉచితంగా అందిస్తామని కాంగ్రెస్ పేర్కొంది. అంతర్జాతీయ క్రీడా పోటీలలో పతకాలు తెచ్చే వారికి నేరుగా ఉపాధి కల్పిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచింది. 

Updated Date - 2020-10-21T17:51:20+05:30 IST