Abn logo
Sep 26 2021 @ 08:38AM

పోలీస్‌ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య

వేలూరు(చెన్నై): స్థానిక పోలీస్‌ క్వార్టర్స్‌లో ఓ పోలీసు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరువళ్లూర్‌ జిల్లా ఎరుంబి గ్రామానికి చెందిన అజిత్‌కుమార్‌ (38) వేలూరు జిల్లా సేవూరు ప్రత్యేక పోలీసు దళం 25వ బెటాలియన్‌లో పనిచేస్తున్నాడు. ఆయన బెటాలియన్‌ ప్రాంగణంలోని క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు. శుక్రవారం అజిత్‌కుమార్‌ గదిలో నిద్రించగా, అతని సహచర స్నేహితుడు శ్రీనివాసన్‌ వెలుపల నిద్రించారు. శనివారం ఉదయం తలుపు తీసుకొని గదిలోకి వెళ్లగా అజిత్‌కుమార్‌ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉండడం కనిపించింది. సమాచారం అందుకున్న తిరువలమ్‌ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇంకా వివాహం కాని అజిత్‌కు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు.

క్రైమ్ మరిన్ని...