Abn logo
Sep 23 2021 @ 00:42AM

27న భారత బంద్‌ను జయప్రదం చేయండి : సీఐటీయూ

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లాకార్యదర్శి హరి


  పెనుకొండ, సెప్టెంబరు 22: కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రైతు, వ్యవసాయ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 27న రైతు వ్యవసాయ, కౌలు రైతు సంఘాలు సీఐటీయు నాయకులు, వామపక్ష పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చేపట్టనున్న భారతబంద్‌లో ప్రజలుపాల్గొని విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గసభ్యులు హరి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధానిమోదీ భారతదేశాన్ని డిస్కౌంట్‌ సేల్‌గా అమ్మకానికి పెట్టాడన్నారు. రైలు, రోడ్లు, విద్యుత, హార్బర్‌లు, ఎయిర్‌పోర్టు, పెట్రోలియం, గ్యాస్‌, టెలికాం, స్టేడియంలు, పరిశ్రమలు, బ్యాంకులు, ఇన్సురెన్స కంపెనీలను తగ్గింపు ధరలకు అమ్మకానికిపెట్టాడాన్నారు.27న చేపట్టే భారతబంద్‌లో అన్ని కార్మిక సంఘాలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం నాయకులు రమేష్‌, సీపీఐ నాయకులు శ్రీరాములు, పెద్దన్న, బాబావలి, తదితరులు పాల్గొన్నారు.