Abn logo
Apr 8 2020 @ 04:31AM

పేదలకు స్థలాల పేరిట కుట్ర

కోర్టులు వీల్లేదంటున్నా తొందర ఎందుకు

మా భూముల్లో వేరే వారిని అడుగు పెట్టనీయం

112వ రోజు కొనసాగిన అమరావతి రైతుల ఆందోళనలు


తుళ్లూరు/గుంటూరు, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): రాజధాని కోసం ఇచ్చిన భూములను కావాలని పేదలకు ఇళ్ల స్థలాల పేరిట ప్రభుత్వం కుట్రలకు తెర తీస్తే సహించేది లేదని  రైతులు తేల్చి చెప్పారు. ప్రాణాలు పోయినా వేరే వారిని ఇక్కడి భూముల్లోకి అడుగు పెట్టనివ్వమన్నారు. అమరావతి నుంచే పాలనంతా సాగాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు మంగళవారానికి 112వ రోజుకు చేరుకున్నాయి. పెదపరిమి, నీరుకొండ దీక్షా శిబిరాల్లో రైతులు వంతుల వారీగా నిరసనలు చేపట్టారు.


అనంతవరం, తుళ్లూరు, మందడం, రాయపూడి, వెలగపూడి, కృష్ణాయపాలెం, బోరుపాలెం, వెంకటపాలెం, యర్రబాలెం, కొరగళ్లు తదితర గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసనలు తెలిపారు. ఇంటి ముందు సేవ్‌అమరావతి అంటూ ముగ్గులు వేశారు. ధాన్యం, కాయగూరలతో సేవ్‌ అమరావతి అని రాసి నిరసనలు తెలిపారు. ‘అమరావతి వెలుగు’ కార్యక్రమాన్ని కొనసాగించారు. 29 గ్రామాల కూడళ్లలో మహిళలు కొవ్వొత్తులతో మానవహారాలుగా ఏర్పడి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. 

Advertisement
Advertisement
Advertisement